Viral Video: మొసలితోనే గేమ్సా..! పుచ్చ పగిలి పోవాల్సిందే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌

ఓ యువకుడు మొసలిపై కూర్చొని ఆ మొసలి నోటిని తెరిచి రెండు దవడలను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు అతను ఆ మొసలిపై కూర్చుని తన తలని దాని నోటిలో పెట్టాడు. కానీ మొసళ్ళు ఎంత శక్తివంతమైనవో అతనికి బహుశా తెలియదునుకుంటా. ఆ తర్వాత జరిగిన సీన్‌ చూస్తే గుండెలు గుబేల్‌ మానాల్సిందే. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో..

Viral Video: మొసలితోనే గేమ్సా..! పుచ్చ పగిలి పోవాల్సిందే..  ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్‌
Stunt With Crocodile

Updated on: Jul 19, 2024 | 3:57 PM

ప్రమాదకరమైన జంతువులతో చేసే విన్యాసాలన్నీ శిక్షకుల పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంటాయి. కానీ, కొందరు సినిమాలు, రియాల్టీ షోలను చూసి మర్చిపోతుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తమ ప్రాణాలను పణంగా పెడుతుంటారు. ఇందుకు ఉదాహరణగా జరిగిందే ఈ వీడియోలోని సంఘటన. రీల్ చేయడానికి తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు వెనుకాడని ఇలాంటివారిని చాలా మందిని సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం ఎక్స్‌లో అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి మొసలితో స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘ఖత్రోన్ కే ఖిలాడీ’గా మారాలనే తపనతో, అటువంటి షోలలో విన్యాసాలు నిపుణుల పర్యవేక్షణలో జరుగుతాయనే విషయాన్ని బహుశా మర్చిపోయినట్టు ఉన్నాడు. అతడు ఏకంగా ఒక ప్రమాదకర మొసలి నోట్లో తల పెట్టి స్టంట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత జరిగిన సీన్‌ చూస్తే గుండెలు గుబేల్‌ మానాల్సిందే. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా  Xలో @NeverteIImeoddలో షేర్‌ చేయబడింది. ఓ యువకుడు మొసలిపై కూర్చొని ఆ మొసలి నోటిని తెరిచి రెండు దవడలను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు అతను ఆ మొసలిపై కూర్చుని తన తలని దాని నోటిలో పెట్టాడు. కానీ మొసళ్ళు ఎంత శక్తివంతమైనవో అతనికి బహుశా తెలియదునుకుంటా. క్షణాల్లో ఆ మొసలి యువకుడి తలను గట్టిగా పట్టేసుకుంది. అక్కడున్న జనం అతన్ని కాపాడేందుకు పరుగులు తీశారు. ఈ వీడియోను షేర్‌ చేస్తున్నప్పుడు క్యాప్షన్‌గా అతి విశ్వాసం అని రాశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోపై చాలా మంది వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు దీనిని ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటున్నారు. ఇది పిచ్చి అని ఒకరు, అతను స్వయంగా రిస్క్‌లో పడ్డాడు అని మరొకరు రాశారు. ఇలా వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు రకరకాల కామెంట్స్‌తో హోరెత్తించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us