Viral Video: ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియాకు నెటిజన్లు ఫిదా!

మన దేశంలో కొందరు సామాన్యులు తమకున్న సృజనాత్మకతతో, తక్కువ ఖర్చుతో కూడిన ఉపాయాలను (దేశీ జుగాడ్) కనిపెడుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే మీరు కూడా ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే.. అతడు కనిపెట్టిన కూలర్‌ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్‌ అని చెప్పాలి..

Viral Video: ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియాకు నెటిజన్లు ఫిదా!
Dustbin Air Cooler

Updated on: Jun 02, 2026 | 8:00 AM

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇళ్లలో ఫ్యాన్లు తిరిగినా కూడా వేడి గాలే వస్తుండటంతో కూలర్లు, ఏసీలను ఆశ్రయించక తప్పడం లేదు. అయితే మధ్యతరగతి, పేద కుటుంబాల వారు వేల రూపాయలు ఖర్చు చేసి కొత్త కూలర్లను లేదా ఏసీలను కొనడం అంత సులభం కాదు. ఇలాంటి సమయంలో మన దేశానికి చెందిన కొందరు సామాన్యులు తమకున్న సృజనాత్మకతతో, తక్కువ ఖర్చుతో కూడిన ఉపాయాలను (దేశీ జుగాడ్) కనిపెడుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే మీరు కూడా ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే.. అతడు కనిపెట్టిన కూలర్‌ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్‌ అని చెప్పాలి..

వేసవి కాలంలో ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే కూలర్లు, ఏసీల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి కేవలం పాత ప్లాస్టిక్ డస్ట్‌బిన్ (చెత్తబుట్ట)ను ఉపయోగించి అద్భుతమైన దేశీ జుగాడ్ (సొంత టెక్నిక్)తో ఎయిర్ కూలర్‌ను తయారు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అవును, మీరు విన్నది నిజమే! ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు ఇంటర్నెట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇవి కూడా చదవండి

కూలర్‌ను ఎలా తయారు చేశాడంటే?: వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. సదరు వ్యక్తి మొదట ఒక పెద్ద సైజు ప్లాస్టిక్ డస్ట్‌బిన్‌ను తీసుకున్నాడు. దానికి ఇరువైపులా గాలి, నీరు తిరగడానికి వీలుగా చతురస్రాకారంలో పెద్ద రంధ్రాలు చేశాడు. ఆ రంధ్రాల వద్ద కూలర్లలో వాడే గడ్డి లేదా కూలింగ్ ప్యాడ్లను అమర్చాడు. డస్ట్‌బిన్ లోపలి భాగంలో నీటిని పైకి పంప్ చేయడానికి ఒక చిన్న వాటర్ పంప్‌ను, అలాగే ముందు వైపు చల్లటి గాలిని బయటకు నెట్టడానికి ఒక ఫ్యాన్‌ను అమర్చాడు. వీటన్నింటికీ విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, డస్ట్‌బిన్‌లో నీళ్లు పోసి ఆన్ చేయగానే.. మార్కెట్లో దొరికే బ్రాండెడ్ కూలర్ లాగే అది చల్లటి గాలిని ఇవ్వడం ప్రారంభించింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ దేశీ జుగాడ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇప్పటివరకు లక్షలాది మంది ఈ వీడియోను చూశారు. తక్కువ బడ్జెట్‌లో ఏసీ లాంటి చల్లదనాన్ని ఇచ్చే ఈ ఐడియాపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. భారతీయుల టాలెంట్‌కు ఇదో నిదర్శనం, ఇంజనీరింగ్ చదవకపోయినా అద్భుతమైన ఆవిష్కరణ చేశాడు అంటూ సదరు వ్యక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తీవ్రమైన ఎండల నుండి తప్పించుకోవడానికి ఇదొక ఉత్తమమైన, చౌకైన మార్గమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us