అంబులెన్స్‌కి కన్నం వేసి లోపల కూర్చున్నాడు.. ఈ లోపే

దొంగతనానికి ఏదైతే ఏం అనుకున్నాడో ఏమో తెలీదు కానీ.. ఓ తెలివి తక్కువ దొంగ అంబులెన్స్‌పై కన్నం వేశాడు.

అంబులెన్స్‌కి కన్నం వేసి లోపల కూర్చున్నాడు.. ఈ లోపే

Updated on: Aug 18, 2020 | 3:07 PM

Man try to steal Ambulance: దొంగతనానికి ఏదైతే ఏం అనుకున్నాడో ఏమో తెలీదు కానీ.. ఓ తెలివి తక్కువ దొంగ అంబులెన్స్‌పై కన్నం వేశాడు. ఎలాగైనా దాన్ని తీసుకెళ్లాలనుకున్నాడు. దీంతో అటూ, ఇటూ చూశాడు. లోపల డ్రైవర్ కూడా లేకపోవడంతో డ్రైవర్ సీట్లో కూర్చుకున్నాడు. వెంటనే అంబులెన్స్‌ని స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి హెల్త్ వర్కర్లు వచ్చి అతడిని పట్టుకున్నారు. అయితే ఆ సమయంలో డ్రైవర్ ఎక్కడికి వెళ్లాడు..? హెల్త్ వర్కర్లు ఎక్కడి నుంచి వచ్చి దొంగను పట్టుకున్నారంటే..!

ఓ రోగిని ఆ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మధ్యలోనే అతడికి అత్యవసర చికిత్స అందివ్వాల్సి వచ్చింది. దీంతో  దాన్ని ఓ పక్కకు ఆపి లోపల హెల్త్ వర్కర్లు వైద్యం చేస్తున్నారు. ఆ సమయంలో డ్రైవర్ సీట్లో లేరు. ఆ స‌మ‌యంలోనే అతడు దొంగ‌త‌నానికి పాల్ప‌డ్డాడు. ఇదంతా గమనించిన లోప‌ల ఉన్న హెల్త్ వ‌ర్క‌ర్.. వెంటనే బ‌య‌ట‌కు వ‌చ్చి దొంగ‌ను ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌చెప్పారు. కాగా తాగిన మ‌త్తులో ఇలా చేశానని, క్ష‌మించాలని అతడు పోలీసుల‌ను వేడుకున్నాడ‌ని అంబులెన్స్ నిర్వాహ‌కులు తెలిపారు.

Read More:

కరోనా వ్యాక్సిన్ ఒప్పందంలో కేంద్రం తొలి అడుగు

‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌లో పవన్‌.. డైరెక్టర్ ఎవరంటే

Loading...
Unable to load recommendations.
Follow Us