Viral Video: స్టైల్‌గా గుర్రమెక్కాలనుకున్నాడు.. సీన్ కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాక్!

|

Jun 06, 2022 | 11:05 AM

లైకుల కోసమో.. లేక వ్యూస్ కోసమో గానీ.. కొంతమంది సరిగ్గా చేసే పనిని కూడా వంకరటింకరగా చేస్తుంటారు. అలా చేసి మూతి పళ్లు రాలగొట్టుకుంటారు.. అలాంటిదే ఇది..

Viral Video: స్టైల్‌గా గుర్రమెక్కాలనుకున్నాడు.. సీన్ కట్ చేస్తే.. దిమ్మతిరిగే షాక్!
Horse Viral Video
Follow us on

సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్నింటిని చూస్తే.. అసలు ఇలా కూడా జరుగుతాయా అని అనిపించేలా ఉంటాయి. ఇక అదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి స్టైల్‌గా గుర్రమెక్కాలని అనుకుంటున్నాడు. అందుకోసం గుర్రం వెనక్కి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి.. ఎగిరి దానిపై కూర్చోవాలని ట్రై చేస్తాడు. గుర్రం ముందే కనిపెట్టిందో.. ఏంటో మరి.. అతడి ప్రయత్నాన్ని నీరుగారుస్తూ.. గుర్రం వెనుక కాళ్లతో ఆ వ్యక్తిని తన్నుతుంది. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ వీడియోను ‘Myths Vs Reality’ అనే ట్విట్టర్ పేజీ అప్‌లోడ్ చేయగా.. దీనికి 35 వేలకు పైగా వ్యూస్.. వెయ్యికి పైగా లైకులు వచ్చాయి. అలాగే ఈ వీడియోను చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..