Viral Video: ఓరి దేవుడా.. మొసలితో విన్యాసాలేంట్రా బాబు..!

|

May 23, 2022 | 7:56 PM

Viral Video: ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలని చూసి నెటిజన్లు షాక్‌ అవుతారు. అసలు వీడియోలో చూసింది

Viral Video: ఓరి దేవుడా.. మొసలితో విన్యాసాలేంట్రా బాబు..!
Crocodile Viral Video
Follow us on

Viral Video: ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలని చూసి నెటిజన్లు షాక్‌ అవుతారు. అసలు వీడియోలో చూసింది నిజమా, అబద్దామా అంటూ ఆశ్చర్యపోతారు. తాజాగా ఒక మొసలి, ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. వాస్తవానికి ఈ వీడియోలో ఒక వ్యక్తి మొసలితో సరదాగా ఆడుతుంటాడు. దానిని ముద్దు పెట్టుకుంటాడు. కౌగిలించుకుంటాడు. వీడియో చూస్తే భయంకరంగా వింతగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వీడియోలని మీరు అరుదుగా చూసి ఉంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి రెండు మొసళ్ల మధ్య అటు ఇటూ తిరుగుతుండటం మనం గమనించవచ్చు. ఆ వ్యక్తి మొసలి గోళ్లను చేతిలోకి తీసుకోవడం మనం వీడియోలో చూడవచ్చు. దీని తర్వాత అతడు మొసలి ముఖంపై ముద్దు పెట్టడమే కాకుండా దానిపై పడుకుని డ్యాన్స్ చేస్తాడు. అంతేకాదు ఈ వ్యక్తి మొసలిని గట్టిగా కౌగిలించుకుంటాడు. ఈ వీడియో చూసిన వారంత ఆ వ్యక్తి చేసిన పనికి నోరెళ్ల బెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోని ఒక నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ వీడియోని ఇప్పటివరకు 34 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఒక నెటిజన్‌ ఇలా అన్నాడు ‘మీ పెంపుడు కుక్క చర్మం కొద్దిగా గరుకుగా ఉంది దాని దంతాలు చాలా వింతగా ఉన్నాయి’ అంటూ కామెంట్‌ చేశాడు. మరొక నెటిజన్‌ ‘ఈ మొసలి ఆ వ్యక్తిపై ఎందుకు దాడి చేయడం లేదని ప్రశ్నించాడు. మొత్తానికి ఈ వీడియో జనాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలపండి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి