
జిమ్‌లో ఓ వ్యక్తిపై ట్రైనర్ దాడి చేశాడు. ఈ దారుణ ఘటన CCTV ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. వ్యాయామం కోసం వినియోగించే కర్రబ్తో అతడి తలపై బలంగా కొట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ జిమ్ ట్రైనర్‌ను అరెస్ట్ చేశారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. 20 ఏళ్ల యోగేష్ షిండే అనే వ్యక్తి గత రెండేళ్లుగా ములుండ్ ఈస్ట్‌లోని జిమ్‌కు రెగ్యూలర్‌గా వెళ్తున్నాడు.
ఈ క్రమంలోనే బుధవారం జిమ్‌లో ఒక ట్రైనర్ సహాయంతో అతడు వ్యాయామాలు చేస్తుండగా, జిమ్‌లో ఒక పక్కన నిల్చోని ఉన్న మరో ట్రైనర్ ధారవి నాకెల్ ఉన్నట్టుండి వ్యాయామాల కోసం వినియోగించే ఉడెన్ క్లబ్‌ను చేతిలో పట్టుకుని వచ్చాడు..నేరుగా యోగేష్ షిండే వద్దకు వెళ్లి అతడి తలపై దానితో కొట్టాడు. ఇదంతా జిమ్‌లోని సీసీకెమెరాలో రికార్డైంది.
యోగేష్‌పై దాడి చేస్తున్న ఆ ట్రైనర్‌ను అక్కడున్న వారంతా కలిసి అడ్డుకున్నారు. గాయపడిన యోగేష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎంఆర్ఐ స్కాన్ చేయగా అతడి పుర్రె ఎడమ వైపున రెండు పగుళ్లు ఏర్పడినట్లు వైద్య పరీక్షలో తేలింది. మరోవైపు దాడి చేసిన జిమ్ ట్రైనర్ నాకెల్పై బాధిత యువకుడు యోగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ట్రైనర్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని చెప్పాడు. దాడికి ముందు అతడి వైపు చూశానని పోలీసులకు చెప్పాడు.
దాడి చేస్తున్న క్రమంలో.. తనేమైనా వ్యాయామాలు తప్పుగా చేస్తున్నానా? అని కూడా అడిగానని, సమాధానం ఇవ్వని అతడు అకస్మాత్తుగా తనపై దాడి చేసినట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..