నడి రోడ్డుపై ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా కొడుతున్నాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగినట్టుగా తెలిసింది. బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు బంక్ వద్దకు చేరుకున్న ఆ ఇద్దరు ఏదో విషయంలో గొడవపడుతున్నారు. అంతలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం కారణంగా రెచ్చిపోయిన ఆ యువకుడు..యువతిని దారుణంగా చితకబాదాడు. అందరి ముందే ఆమెను పట్టుకుని విచక్షణారహితంగా కొట్టసాగాడు..ఆమెను దారుణంగా కిందపడేసి మరీ కొడుతున్నాడు.
गाजियाबाद : युवक ने अपनी महिला दोस्त को पीटा
ఇవి కూడా చదవండిबाइक में तेल डलवाते समय हुआ विवाद
युवती की पिटाई का वीडियो सोशल मीडिया पर हुआ वायरल
साहिबाबाद थाना क्षेत्र के अर्थला स्थित पेट्रोल पंप का मामला@ghaziabadpolice @Uppolice #Ghaziabad pic.twitter.com/rbLOZ83kCr
— Bittu Pandit Reporter (@BittuPa76040164) October 28, 2024
పెట్రోల్ బంక్ లో చాలా మంది వాహనదారులు నిలబడి ఉన్నారు. కానీ, ఎవరూ కల్పించుకుని అతన్ని అడ్డుకోలేదు. అతడు కిరాతకంగా ఆమెను చావబాదుతుంటే..అక్కడున్న వారంతా చోధ్యం చూడసాగారు. ఇంత జరుగుతున్నప్పటికీ స్థానికులు వీడియోలు తీయడం తప్ప అతడిని ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్ నెట్ లో వేగంగా వైరల్ అవుతుంది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు దీనిపై స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..