వీధుల్లో కూరగాయలు అమ్ముతున్న తల్లి.. CA ఉత్తీర్ణుడైన కొడుకు.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్

|

Jul 16, 2024 | 12:44 PM

ఓ యువకుడు చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ) పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని చూసి అతని తల్లి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఓ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థానేలోని డోంబివాలి తూర్పు ప్రాంతంలో ఓ మహిళ కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ మహిళ కుమారుడు యోగేష్ ఇటీవల సీఏ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.

వీధుల్లో కూరగాయలు అమ్ముతున్న తల్లి.. CA ఉత్తీర్ణుడైన కొడుకు.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్
Viral Video
Follow us on

ప్రతిభ, చదువు ఏ ఒక్కరి సొత్తు కాదు.. జీవితానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించాలనే కృషి, పట్టుదలతో కష్టపడితే విజయం మీ చెంత వాలుతుంది.. అని పెద్దలు చెప్పిన మాటలను కొంతమంది వ్యక్తులు జీవితానికి అన్వయించుకుంటారు. పరిస్తితులకు ఎదురీది మరీ తమ లక్ష్యాన్ని అందుకుంటారు. తాజాగా ఓ యువకుడు చార్టర్డ్ అకౌంటెంట్ (సిఎ) పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. తన కొడుకు సాధించిన విజయాన్ని చూసి అతని తల్లి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఓ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థానేలోని డోంబివాలి తూర్పు ప్రాంతంలో ఓ మహిళ కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ మహిళ కుమారుడు యోగేష్ ఇటీవల సీఏ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.

వైరల్ అవుతున్న వీడియోలో యోగేష్ పరీక్షలో విజయం గురించి తెలియజేయడానికి తన తల్లి వద్దకు వెళ్ళాడు. అప్పుడు ఆ మహిళ రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతోంది. కొడుకు తాను సీఏ పరీక్ష పాస్ అయ్యానని తల్లికి చెప్పగానే.. అతని తల్లి ఆనందంతో గంతులు వేసింది. అంతేకాదు భావోద్వేగంతో ఏడ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత కొడుకుని కౌగిలించుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. 45 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూపరులను భావోద్వేగానికి గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి రవీంద్ర చవాన్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేశారు. కూరగాయలను అమ్మే థోంబ్రే మావ్షి కుమారుడు యోగేష్ చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాడు. మేము తల్లి కొడుకుల తలచుకుని చాలా గర్విస్తున్నాము.. యోగేష్! క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిరాస చెందకుండా పట్టుదలతో కష్టపడి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించాడు. అతని విజయాన్ని చూసి తల్లి ఆనందంతో కన్నీరు పెట్టింది అని కామెంట్ జత చేశారు.

ఇక్కడ వీడియో చూడండి

జూలై 14న షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా వీక్షించగా.. చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తూ యోగేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యోగేష్ , అతని తల్లి ఈ స్ఫూర్తిదాయకమైన కథను చాలా మంది ప్రశంసించారు. ఒకరు ఎవరైనా తలచుకుంటే విధి రాతను మార్చుకోలడు అని నిరూపించాడు. ఇది నిజంగా స్ఫూర్తిదాయకం అని కామెంట్ చేయగా.. మరొకరు కష్టపడితే ఎప్పుడూ ఫలితం ఉంటుంది అని అన్నారు. మరొకరు ‘ఈ వీడియో తల్లి, కొడుకుల ప్రేమ, త్యాగాన్ని చూపుతుంది’ అని వ్యాఖ్యానించారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..