Viral Video: పానీపూరితో నూడుల్స్.. ఎగబడిన జనాలు.. నెట్టింట్లో వీడియో వైరల్..

|

Jan 16, 2022 | 11:10 AM

సాధారణంగా ఒక్కోక్కరికి ఒక్కో టెస్ట్ ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఫుడ్ వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి

Viral Video: పానీపూరితో నూడుల్స్.. ఎగబడిన జనాలు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Viral
Follow us on

సాధారణంగా ఒక్కోక్కరికి ఒక్కో టెస్ట్ ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఫుడ్ వీడియోస్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కొత్త కొత్తగా వంటలను ట్రై చేస్తున్న వీడియోలు రోజూ చూస్తూనే ఉంటాం. అందులో కొన్ని సూపర్ అనిపించగా.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాగే మరికొన్ని విచిత్ర వంటలను చూస్తే విగటు పుట్టిస్తాయి. ఇక పానీపూరితో చేసే ప్రయోగాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల నెట్టింట్లో వీటికి సంబంధించిన వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. ఫైర్ పానీపూరి.. శాండ్ విచ్ పానీపూరి, బర్గర్ పానీపూరి ఇలా ఒక్కటేమిటీ అనేక రకాల వీడియోస్ వందల కొద్ది నెట్టింట్లో వైరల్ అవుతుంది. తాజాగా పానీపూరితో మరో కొత్త వంటకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాధారణంగా పానీపూరిని ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా పానీపూరి షాప్ దగ్గర అమ్మాయిలు క్యూ కట్టేస్తారు. బంగాళదుంపలు, సమోసా, పెరుగు వేసి చేసే పానీపూరిని ఇష్టంగా తినేస్తారు. కానీ లక్నోకు చెందిన ఓ వ్యక్తి మాత్రం పానీపూరిలో నూడుల్స్ వేసి తయారు చేస్తున్నారు. ముందుగా పూరీలో బంగాళా దుంపలతో నింపి అందులో మరిన్ని మసాలాలు వేస తీపి చట్నీ జోడంచాడు. ఆ తర్వాత పానీపూరిపై నూడిల్స్ వేసి దానిపై సాస్.. పెరుగు.. పచ్చిమిర్చి, టూటీ ఫ్రూటీ, కొత్తిమీర, తురిమిన కొబ్బరిని జోడించాడు. ఈ పానీపూరి వడ్డించే కంచంలో ఎరుపు, ఆకుపచ్చ చట్నీను జోడించాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెట్స్ చేస్తున్నారు.

Also Read: Naga Chaitanya: ఆ విష‌యంలో నాకు స‌మంతే బెస్ట్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన నాగ‌చైత‌న్య‌..

Sumanth’s Malli Modalaindi: ఓటీటీకే ఓటేసిన అక్కినేని హీరో.. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిన ‘మళ్లీ మొదలైంది’.

Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!

Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..