Watch Video: ‘లో బడ్జెట్ వెన్నెల’ నోట కీర్తి సురేష్ డైలాగ్.. ఎంత వయ్యారంగా నడుము ఊపుతూ చెప్పిందో మీరే చూడండి..

Dasara Movie Dialogue Dubsmash: నిత్యం అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా వైరల్ అయ్యేవాటిలో సినిమా డైలాగులు, డ్యాన్స్ స్టెప్పులు, కామెడీ సీన్స్ స్పూఫ్ వంటివెన్నో ఉంటాయి. తాజాగా నెట్టింట ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. కొన్ని నెలల క్రితమే విడుదలైన నాని ‘దసరా’ సినిమాలో..

Watch Video: ‘లో బడ్జెట్ వెన్నెల’ నోట కీర్తి సురేష్ డైలాగ్.. ఎంత వయ్యారంగా నడుము ఊపుతూ చెప్పిందో మీరే చూడండి..
Dasara Movie Dialogue Dubsmash

Updated on: Jun 09, 2023 | 4:07 PM

Dasara Movie Dialogue Dubsmash: నిత్యం అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా వైరల్ అయ్యేవాటిలో సినిమా డైలాగులు, డ్యాన్స్ స్టెప్పులు, కామెడీ సీన్స్ స్పూఫ్ వంటివెన్నో ఉంటాయి. తాజాగా నెట్టింట ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. కొన్ని నెలల క్రితమే విడుదలైన నాని ‘దసరా’ సినిమాలో కీర్తి సురేష్ చెప్పిన ఓ డైలాగ్‌కి డబ్‌స్మాష్ వీడియో అది. ఇక ఆ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఆ వీడియోలో ఓ చిన్నారి దసరా సినిమాలోని కీర్తి సురేష్‌లా కనిపించేందుకు చున్నీ(దుపట్టా)ని చీరలా కట్టుకుని ఉంటుంది. నడుచుకుంటూ వచ్చి అక్కడే ఉన్న ఓ మహిళతో ‘సూరిగాడు ఉన్నడా అత్తా..?’ అంటూ ఎంతో వయ్యారంగా తన నడుమును కదిలిస్తూ అడుగుతుంది. అందుకు ఆ మహిళ సినిమాలో డైలాగ్ చెప్పినట్లుగానే లిప్ మూమెంట్ ఇస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో venkey.kinnera అనే ఇన్‌స్టా ఖాతా నుంచి షేర్ కాగా.. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.


ఇదిలా ఉండగా.. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వారికి తోచినవిధంగా కామెంట్ చేస్తున్నారు. ‘ఓ పిల్ల సడెన్ గా చూసి దెయ్యం ఏమో ఆంటీ బయటికి పరుగు తిస్తది ఏమో అనుకున్నా…పిల్ల పిల్లి వాక్ చేసుకుంటూ వచ్చింది…???’.. ‘రియల్ డైలాగ్ సూపర్ చిన్నారి తల్లి’.. ‘తలుపు పైన మామ ఉన్నాడు ???’.. ‘లో బడ్జెట్ వెన్నెల..’ అంటూ రాసుకొస్తున్నారు. అలాగే ఈ వీడియోకు ఇప్పటివరకు 2 లక్షలకు పైగా లైకులు, 16 లక్షల వీక్షణలు లభించాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..