డ్రైవింగ్‌కు నిర్దిష్ట స్థాయి అనేది ఉంటుంది. అందుకే ప్రతి దేశానికి కనీస వయస్సు ఉంటుంది. ఇది డ్రైవర్లు వాహనాన్ని సురక్షితంగా ఆపరేట్ చేయగల దశకు చేరుకున్నారని నిర్ధారించుకోవడానికి సహాయపడుతుంది. మనం రోడ్ల మీద పిల్లలు బైక్‌లు లేదా కార్లు నడుపుతున్న సందర్భాలు చూస్తూ ఉంటాం.. తాజా అలాంటి ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక చిన్న అమ్మాయి తన తండ్రితో కలిసి పిలియన్‌పై స్కూటర్‌ను నడుపుతున్నట్లు ఓ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది.
స్కూల్ యూనిఫాంలో ఉన్న అమ్మాయి తన తండ్రితో కలిసి స్కూటర్ నడుపుతుంది. హెల్మెట్ లేకుండా తండ్రిని వెనుక కూర్చొని బైక్ నడుపుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకలుగా స్పందిస్తున్నారు. చాలా మంది ఇలా తండ్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లకు హెల్మెట్ కూడా లేకుండా తండ్ర బైక్ ఎలా ఇచ్చాడు అని మండిపడుతున్నారు. ఈ దృశ్యాలు చూడడానికి బాగానే ఉన్నా..పాపం చిన్న పిల్లకు అలా మెయిన్ రోడ్డుపై బైక్ నడిపించడం కరెక్ట్ కాదని పేర్కొంటున్నారు. కొంచమైనా బుద్ది ఉండాలి కదా? ఇంత బాధ్యతా రహితంగా ఉంటే ఎట్లా..అని తండ్రిని ఉద్దేశించి మండిపడుతున్నారు.