Video Viral: ఈ బుజ్జితల్లిది ఎంత క్యూట్ మనస్సు.. పెంపుడు కుక్క కోసం చిన్నారి చేసిన పనికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే..

|

Apr 06, 2022 | 10:42 AM

సాధారణంగా చిన్న పిల్లలు చేసే అల్లరి చేష్టలు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఇక తమ ఇంట్లో ఉండే కుక్క పిల్లలతో కుక్కపిల్లలు ఎంతో ప్రేమగా ఉంటారు.

Video Viral: ఈ బుజ్జితల్లిది ఎంత క్యూట్ మనస్సు.. పెంపుడు కుక్క కోసం చిన్నారి చేసిన పనికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే..
Viral Videos
Follow us on

సాధారణంగా చిన్న పిల్లలు చేసే అల్లరి చేష్టలు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. ఇక తమ ఇంట్లో ఉండే కుక్క పిల్లలతో కుక్కపిల్లలు ఎంతో ప్రేమగా ఉంటారు. వాటితో ఆడుకోవడం.. ఆటపట్టించడం చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. పెంపుడు కుక్క పిల్లలను చాలా ప్రేమిస్తారు. ఓ చిన్నారి మాత్రం తను కూడా తన పెంపుడు కుక్క మాదిరిగా కనిపించాలనుకుంది. అందుకు తన కుక్కపిల్లను పక్కనే పెట్టుకుని తాను అలాగే రెడీ కావాలనుకుంది. అచ్చం తన కుక్క పిల్ల మాదిరిగానే మేకప్ వేసుకుంది. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

తన పెంపుడు కుక్పిల్ల మాదిరిగా కనిపించేందుకు ఆ చిన్నారి అచ్చం అలాగే మేకప్ వేసుకుంది. ఆమె బుగ్గలు, ముక్కు తెల్లగా ఉండగా.. కళ్లు.. ముక్కు చివర.. పెదవులు నలుపు రంగులో ఉండేలా మేకప్ వేసుకుంది. అయితే అలా మేకప్ ఎందుకు వేసుకుంటున్నావని తన తల్లి అడిగినప్పుడు .. ఆ చిన్నారి మాట్లాడుతూ.. నేను నా కుక్క ఫ్రాన్సిస్కోలా కనిపించాలనుకుంటున్నాను అని చెప్పింది. ఈ చిన్నారి పక్కనే ఆ పెంపుడు కుక్క ఎంతో అయోమయంగా కెమెరాను చూస్తూ ఉండడంతో ఆ చిన్నారి తల్లి పగలబడి నవ్వింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Viral Photo: ఈ ఇద్దరు చిన్నారులు అమ్మాయిల ఫేవరేట్ హీరోస్.. ఈ బ్రదర్స్ ఇద్దరి క్రేజ్ వేరేలెవల్..

Anjali: క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్, శంకర్ సినిమాలో అంజలి ?.. ఏ పాత్రలో అంటే..

Samantha: విడాకుల తర్వాత తొలిసారి నాగచైతన్య ఫోటో షేర్ చేసిన సమంత.. ఎందుకంటే..

Viral Video: వధూవరులకు స్టేజ్ పైనే షాకిచ్చిన స్నేహితులు.. ఏం చేశారో తెలిస్తే షాకవుతారు.. వీడియో వైరల్..