Viral Video: నోటిని క్లీన్ చేసిన చిన్న చేప పిల్ల.. ఎలా చేసిందో మీరే చూసేయండి..

|

Aug 15, 2024 | 1:09 PM

సోషల్ మీడియా అన్నాక చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ వీటిల్లో మనసుకు హత్తుకునే వీడియోలు, ఫన్నీ వీడియోలు, భయాన్ని పెంచే వీడియోలు ఇలా చాలానే ఉంటాయి. నెట్టింట ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు మరింత జోరుగా వైరల్ అవుతాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా మనం చేపలను పట్టుకున్నామంటే.. వండుకుని తినేస్తాం. కానీ మీ నోటిలోకి చేపను అనుమతించి..

Viral Video: నోటిని క్లీన్ చేసిన చిన్న చేప పిల్ల.. ఎలా చేసిందో మీరే చూసేయండి..
Viral Video
Follow us on

సోషల్ మీడియా అన్నాక చాలా రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ వీటిల్లో మనసుకు హత్తుకునే వీడియోలు, ఫన్నీ వీడియోలు, భయాన్ని పెంచే వీడియోలు ఇలా చాలానే ఉంటాయి. నెట్టింట ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు మరింత జోరుగా వైరల్ అవుతాయి. వాటిల్లో ఇది కూడా ఒకటి. సాధారణంగా మనం చేపలను పట్టుకున్నామంటే.. వండుకుని తినేస్తాం. కానీ మీ నోటిలోకి చేపను అనుమతించి.. మీ దంతాలను శుభ్రం చేయడానికి ఓపికగా వేచి ఉంటారా? కానీ ఇక్కడ ఇతను నోరు చాపగానే.. నోట్లోకి చేప వెళ్లి నోటిని క్లీన్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో ఒక స్కూబా డ్రైవర్ నీటిలో ఉన్నాడు. అతన నోటిని తెరిచి ఉండగా.. ఒక రెండు చేపలు వచ్చాయి. ముందు ఒక చేప నోటిలోకి వెళ్లి.. తన నోటిని క్లీన్ చేసింది. ఆ తర్వాత మరో చేప కూడా ఇలానే చేసింది. ఇది చూస్తుంటే నిజంగానే విచిత్రంగా, చాలా ఫన్‌గా ఉంది. మీకు తెలియకుండానే నవ్వు కూడా వచ్చేస్తుంది. సాధారణంగా చేపలు దగ్గరకు రాగానే కాస్త భయంగానే ఉంటుంది. ఈ స్కూబా డ్రైవర్ ఇది చేయడం మొదటి సారి కాదు. ఇంతకు ముందు కూడా ఇలానే చేశాడు. అతని నోట్లో ఒక చేప ఈదుతున్న వీడియో చాలా వైరల్‌గా మారింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇకపై మీకు బ్రెష్ అవసరం లేదు’.. ‘చేప గొంతులోకి ఇరుక్కుంటే’.. ‘ఇన్నాళ్లూ నేను తెలివి తక్కువగా బ్రష్‌తో క్లీన్ చేసుకున్నా’.. ‘ఇక నుంచి నేను కూడా ఇలానే చేస్తాను’.. అని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.