Viral: కన్నంలో ఉన్న పామును బయటకు లాగి కరకరా నమిలి తిన్న మరో పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ఇప్పటివరకు మీరు స్నేక్స్‌కు సంబంధించిన చాలా వీడియోలు చూసి ఉంటారు. కానీ ఇది డిఫరెంట్. పాము వేట ఎంత భయానకంగా ఉంటుందో దీని ద్వారా మీకు తెలిసిపోతుంది.

Viral: కన్నంలో ఉన్న పామును బయటకు లాగి కరకరా నమిలి తిన్న మరో పాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Snake Viral Video

Updated on: Mar 31, 2022 | 4:21 PM

Trending Video: పాములకు సంబంధించిన వీడియోలు మీరు సోషల్ మీడియా(Social Media)లో చాలా చూసి ఉంటారు. కానీ ఈ వీడియో చూస్తే మీ నరాలు కట్ అవుతాయి.  కప్పల్ని, ఎలుకల్ని, పక్షుల్ని పాము మింగడం మీరు చూసే ఉంటారు. కొండచిలువలు అయితే అన్ని రకాల జంతువులను మింగేస్తాయి. కానీ ఒక పాము మరో సర్పాన్ని మింగడం చాలా రేర్. ఒక జాతి జీవి, అదే జాతి జీవిని తినడాన్ని కానిబాలిజం(Cannibalism) అంటారు. తాజాగా ఓ స్టన్నింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, కింగ్ కోబ్రా(King Cobra) మరో భారీ పామును కన్నంలో నుంచి బయటకు లాగి మరీ కరకరా నమిలి మింగేసింది. కోబ్రా ఎంత ఆకలితో ఉందో ఏమో కానీ.. అవతల పాము ప్రాణాలు దక్కించుకోడానికి పెనుగులాడుతున్నా.. కనీసం జాలి లేకుండా.. మింగేసింది. కోబ్రా బారి నుంచి తప్పించుకునేందుకు అవతలి పాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. క్లిప్ చివరిలో  కింగ్ కోబ్రా వేటాడిన పాము తోక భాగాన్ని మింగడం చూడవచ్చు. ఈ వీడియోని స్నేక్ వరల్డ్ అనే పేజ్ నుంచి ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు భారీగా లైక్స్, షేర్స్ వస్తున్నాయి.  వామ్మో ఈ పాము చాలా డేంజర్ అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.  కింగ్ స్నేక్స్, కింగ్ కోబ్రా, బ్లాక్ హెడ్డెడ్ కొండచిలువలు, ముసురానా వంటి పాములు.. ఇతర పాములను తింటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి దృశ్యాలు కెమెరా కంటికి చిక్కడం మాత్రం చాలా అరుదు. ఆ షాకింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us