Viral: పెళ్లయిన గంటకే భార్యను తమ్ముడికిచ్చి పెళ్లి చేసేశాడు.. ఆ గ్యాప్‌లో ఏం జరిగిందో తెలిస్తే షాకే..

|

Jan 05, 2023 | 8:39 PM

కన్యాదానం సినిమా ఐడియా ఉందా.. ఆ సినిమాలో హీరో శ్రీకాంత్ తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని.. తన స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అనంతరం వారిద్దరినీ దూరంగా పంపించేస్తాడు.

Viral: పెళ్లయిన గంటకే భార్యను తమ్ముడికిచ్చి పెళ్లి చేసేశాడు.. ఆ గ్యాప్‌లో ఏం జరిగిందో తెలిస్తే షాకే..
Marriage Cancel
Follow us on

కన్యాదానం సినిమా ఐడియా ఉందా.. ఆ సినిమాలో హీరో శ్రీకాంత్ తాను పెళ్లి చేసుకున్న అమ్మాయిని.. తన స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తరువాత వారిద్దరినీ దూరంగా పంపించేస్తాడు. అయితే, శ్రీకాంత్ అలా చేయడానికి కారణం.. హీరోయిన్, తన స్నేహితుడు ఇద్దరూ అంతకు ముందే ప్రేమించుకున్నారు. ఆ కారణంగా శ్రీకాంత్ అలా చేశాడు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. అయితే, ఇందులో ప్రేమ వ్యవహారం లేకపోయినా.. కట్టుకున్న భార్యను పెళ్లి జరిగిన గంటలోనే తన తమ్ముడికిచ్చి వివాహం చేశారు. అయితే, ఇదంతా జరగడానికి కారణం ఓ మహిళ ఎంట్రీనే. అవును, ఆ మహిళ ఎవరో కాదు.. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అతని మొదటి భార్య.

ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే, ఈ దంపతుల మధ్య కొన్ని రోజులకే గొడవలు జరిగాయి. దాంతో భార్య.. తన భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య లేకపోవడంతో.. ఆ భర్త మరో యువతితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య.. నేరుగా పెళ్లి వేడుక వద్దకు వచ్చింది. పంచాయితీ పెట్టింది. దాంతో చేసేది లేక.. సదరు వ్యక్తి పెళ్లి జరిగిన గంటకే రెండో భార్యకు తలాఖ్ చెప్పాడు. ఇక ఆ అమ్మాయికి అన్యాయం జరుగొద్దనే ఉద్దేశ్యంతో.. తన తమ్ముడికిచ్చి పెళ్లి చేశాడు. ఈ పెళ్లి మ్యాటర్ ఇప్పుడు సంభాల్ జిల్లాలో సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..