Viral: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో సరికొత్త చరిత్ర.. యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు..

|

Jul 06, 2022 | 2:19 PM

Indian Air Force: సరికొత్త చరిత్ర సృష్టించారు తండ్రి కూతురు. ఈ అరుదైన సంఘటనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎయిర్ కమొడోర్‌ సంజయ్ శర్మ(Sanjay Sharma), ఆయన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ(Ananya Sharma) కలిసి ఫైటర్‌ జెట్‌ను నడిపి రికార్డు నెలకొల్పారు.

Viral: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో సరికొత్త చరిత్ర.. యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు..
AIR COMMODORE SANJAY SHARMA and his daughter ANANYA SHARMA
Follow us on

IAF Father-Daughter Duo: భారత వైమానిక దళంలో (Indian Air Force) సరికొత్త చరిత్ర సృష్టించారు తండ్రి కూతురు. ఈ అరుదైన సంఘటనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎయిర్ కమొడోర్‌ సంజయ్ శర్మ(Sanjay Sharma), ఆయన కుమార్తె ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ(Ananya Sharma) కలిసి ఫైటర్‌ జెట్‌ను నడిపి రికార్డు నెలకొల్పారు. యుద్ధ విమానాన్ని నడిపిన మొట్టమొదటి తండ్రీకూతుళ్లుగా నిలిచారు. ఫైటర్‌ జెట్‌ ముందు ఫోజులిస్తున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గతంలో ఎన్నడూ జరగని సంఘటన ఇది అని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫోటో చూసి మీరు కూడా గర్వపడతారు. ఫ్లయింగ్ ఆఫీసర్ అనన్య శర్మ తన తండ్రి ఫైటర్ పైలట్‌తో కలిసి ప్రయాణించిన తొలి భారతీయ మహిళా పైలట్‌గా నిలిచారు. భారత వైమానిక దళానికి చెందిన హాక్ 132 విమానం తొలిసారిగా తండ్రీకూతుళ్ల జోడీ. తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన అనన్య శర్మ తన తండ్రి కూడా గర్వపడేలా సాధించింది.

1989లో వైమానిక దళంలో చేరిన తన తండ్రి ఎయిర్ కమాండర్ సంజయ్‌ శర్మ అడుగుజాడల్లోనే అనన్య శర్మ నడిచింది. తానూ సైన్యంలో చేరి దేశానికి సేవలందించాలని నిశ్చయించుకుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీటెక్‌ పూర్తి చేసిన అనన్య శర్మ.. వైమానిక దళం మొదటి మహిళా ఫైటర్ పైలట్ల బృందం (2016)లో చోటు దక్కించుకుంది. అనంతరం ఫ్లయింగ్ బ్రాంచ్‌ శిక్షణ తీసుకుంది. భారత వైమానిక దళంలో మహిళా ఫైటర్ పైలట్‌లను చేర్చుకునేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కఠిన శిక్షణ పొంది గతేడాది డిసెంబర్‌లో ఫైటర్ పైలట్‌గా చేరారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్ కమాండర్ సంజయ్ శర్మ, ఆయన కుమార్తె అనన్య శర్మ మే 30 న విమానంలో ప్రయాణించారు. భారత వైమానిక దళంలో తండ్రీ కూతుళ్లు చరిత్ర సృష్టించడం ఇదే తొలిసారి. భారతీయ వైమానిక దళం ప్రకారం కర్ణాటకలోని బీదర్‌లో హాక్-132 విమానం ఫ్లై అయ్యింది.

మే 30వ తేదీన కర్ణాటకలో బీదర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో హాక్-132 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ తండ్రీకూతుళ్లు ప్రయాణించి హిస్టరీ క్రియేట్ చేశారు. ఓ మిషన్‌ కోసం ఇలా తండ్రి, కుమార్తె ఒకే యుద్ధ విమానంలో కలిసి ప్రయాణించడం ఇదే తొలి సారి అని వైమానిక దళం వెల్లడించింది.

తండ్రి సంజయ్‌తో కలిసి ఒకే యుద్ధ విమానంలో ప్రయాణించడంతో అనన్య కల సాకారమైనట్లయ్యింది. అనన్య ప్రస్తుతం బీదర్‌ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో శిక్షణ పొందుతోంది. తండ్రీకూతురు కలిసి యుద్ధ విమానం ముందు దిగిన ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు వారికి అభినందనలు తెలుపుతున్నారు.