Viral Video: నువ్వు చేసిన సాయం ఎప్పటికి మర్చిపోలేనిదే బ్రో.. నెట్టింట్లో ప్రశంసలు అందుకుంటున్న యువకుడు..

|

Dec 11, 2022 | 7:24 PM

ఓ వ్యక్తికి ఏది అవసరమో అది సాయం చేస్తే.. సాయం చేసిన వ్యక్తికి కలిగే సంతృప్తితో పాటు.. సాయం పొందే వ్యక్తి ఆనందానికి అవధులుండవనేది అందరికి తెలిసిన విషయమే. సమాజంలో రకరకాల మనుషులు ఉంటూ ఉంటారు. పేదరికం కారణంగా కొందరు ఇబ్బందులు..

Viral Video: నువ్వు చేసిన సాయం ఎప్పటికి మర్చిపోలేనిదే బ్రో.. నెట్టింట్లో ప్రశంసలు అందుకుంటున్న యువకుడు..
Divyang Boy
Follow us on

ఓ వ్యక్తికి ఏది అవసరమో అది సాయం చేస్తే.. సాయం చేసిన వ్యక్తికి కలిగే సంతృప్తితో పాటు.. సాయం పొందే వ్యక్తి ఆనందానికి అవధులుండవనేది అందరికి తెలిసిన విషయమే. సమాజంలో రకరకాల మనుషులు ఉంటూ ఉంటారు. పేదరికం కారణంగా కొందరు ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు తమ అంగవైకల్యం కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇటీవల సోషల్ మీడియా వ్యాప్తి విస్తృతం అయిన తర్వాత.. కొందరు వ్యక్తులు చిన్న సాయం చేసినా పెద్దగా ప్రచారం చేసుకోవడం కనిపిస్తోంది. అలాగే ఎంతో సాయం చేసినా ప్రచారం కోరుకోని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఏది ఏమైనప్పటికి ఓ వ్యక్తి అవసరాన్ని గుర్తించి సాయం చేయడం అంటే దానికి మించిన మరోగొప్ప పని ఏముంటుంది. ఆ సమయంలో వ్యక్తి అవసరం తీరితే చాలు.. ఆ సాయం యొక్క విలువ లెక్కల్లోకే రాదు. తాజాగా ఓ దివ్యాంగుడి అవసరాన్ని గుర్తించిన వ్యక్తి.. తనకు కావల్సిన వస్తువులను ఇచ్చి.. దివ్యాంగుడి కళ్లల్లో ఆనందాన్ని చూశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మనం చూస్తున్న అనేక ఘటనలు హృదయాన్ని హత్తుకునే విధంగానూ ఉంటున్నాయి. ఓ వ్యక్తికి సాయం చేయడం అంటే చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే మనవల్ల ఓ వ్యక్తి ఆనందాన్ని పొందగలుగుతున్నాడంటే.. మన జీవితంలో కూడా అది సంతోషకరమైన ఘటనే అవుతుంది.

ఓ దివ్యాంగ వ్యక్తికి సహాయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియో చూసి సాయం చేసిన వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి.. దివ్యాంగుడిని ఇంటర్వ్యూ చేస్తుండగా.. తాను వీల్ చైర్ కోసం సిటీకి వచ్చానని.. అయినా తాను అది పొందలేకపోయానని చెప్పాడు. ప్రస్తుతం తన ఏకైక కోరిక తన గ్రామానికి తిరిగి వెళ్లడమే అని, తన దగ్గర ఊరు వెళ్లడానికి డబ్బులు లేవని తెలిపాడు. ఇది విన్న తర్వాత.. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ఓ దుకాణానికి తీసుకెళ్లి దివ్యాంగుడికి వీల్‌చైర్ కొని ఇస్తాడు. అలాగే ఊరువెళ్లేందుకు బస్సు ఛార్జీలకు అవసరమైన పైకం ఇవ్వడంతో పాటు.. అదనంగా ఖర్చుల కోసం కొంత డబ్బులిచ్చారు. తన కోరిక నెరవేరినందుకు దివ్యాంగుడు సంతోషం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకు షేర్ చేసినప్పటి నుంచి దాదాపు పది లక్షల లైక్‌లు వచ్చాయి. బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా ఈ వీడియోపై కామెంట్ చేశారు. “గాడ్ బ్లెస్ యు” అని ఆమె తన కామెంట్ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..