సాధారణంగా వాష్‌రూంకు ఎందుకు వెళ్తాం చెప్పండి.! ఇదేం సిల్లీ క్వశ్చన్ అని అనుకుంటున్నారా.? ఆగండాగండి.. అసలు విషయం మీకే అర్ధమవుతుంది.. రిలాక్సేషన్ కోసం.. లేదా ఇతరత్రా పనులు పూర్తి చేసుకునేందుకు వాష్‌రూమ్‌కు వెళ్తుంటాం. మరి అలా వెళ్లినప్పుడు.. అక్కడ ఊహించని సీన్ మనకు ఎదురైతే.. గుండె ఆగినంత పనవుతుంది. తాజాగా అలాంటి షాకింగ్ సిట్యుయేషన్‌లో పడేసేలా ఓ సంఘటన జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి అదేంటో తెలుసుకుందాం పదండి.!
వాష్‌రూంకని బయలుదేరిన ఓ విద్యార్ధికి.. పుమ యానిమల్ ఎదురైంది. పుమ యానిమల్ అనేది పులి జాతికి చెందినది. చాలా అరుదుగా కనిపిస్తుంది. చూడ్డానికి కాస్త పిల్లిలా ఉంటుంది. కానీ ఇది కూడా ఎవరైనా మనిషి కనిపిస్తే చాలు.. ఇదిగో ఇలాగే గాండ్రించినంత పనిచేస్తుంది. వాష్‌రూంకు వెళదామనుకున్న ఓ స్టూడెంట్.. డోర్ తీస్తుండగా ఇది కనిపించింది. అంతే భయంతో వాడు రెండు స్టెప్పులు వెనక్కి వేశాడు. అప్పటికే తన చేతిలో సెల్‌ఫోన్ ఉండడంతో దాని వీడియో అందులో రికార్డయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
కాగా, ఇలా జంతువులు తమ ఆవాసాలను వదిలేసి.. జనావాసాల్లోకి ఎంటర్ అవుతుండటంతో.. మనుషులకు నిద్రపట్టడం లేదు. ఎక్కడ.. ఏ జంతువు కనిపిస్తుందా అని వణికిపోతున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియో చూసేయండి.