
హర్యానా: ఆరు నెలల పసికందుపై పిట్‌బుల్ కుక్క దాడి చేసిన ఘటన హర్యానాలోని సోనిపట్‌లో కలకలం రేపింది. సిక్కా కాలనీలో సెప్టెంబర్ 14న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడగా, అతడిని ప్రస్తుతం రోహ్‌తక్‌లోని PGIMSలో చికిత్స అందిస్తున్నారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చిన్నారి తన అత్త ఒడిలో ఉండగా, సమీపంలోని ఓ ఇంటి గేటు తెరుచుకుంది. అదే సమయంలో బయటకు వచ్చిన పిట్‌బుల్ ఒక్కసారిగా వారిపై దూసుకొచ్చింది. మొదట మహిళపై దాడి చేసిన కుక్క.. ఆ తర్వాత ఆమె ఒడిలో ఉన్న చిన్నారిని పట్టుకుంది. దాడి తీవ్రతకు చిన్నారి కిందపడిపోగా, కుక్క అతడిని పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లినట్లు సీసీటీవీలో కనిపించింది. చిన్నారిని రక్షించేందుకు బువా ప్రయత్నించగా ఆమె కూడా గాయపడినట్లు అధికారులు, కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని కుక్కను చిన్నారి నుంచి వేరు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొంతసేపటి తర్వాత చిన్నారిని కుక్క నుంచి విడిపించారు. దాడిలో చిన్నారి ముఖం, పొత్తికడుపు, చేతులు సహా పలు శరీర భాగాలకు తీవ్ర గాయాలైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించగా, పొత్తికడుపు గాయాలకు శస్త్రచికిత్స చేసి సుమారు 20 కుట్లు వేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చికిత్స ఖర్చు పెరగడంతో అనంతరం చిన్నారిని రోహ్‌తక్ PGIMSకు తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. తాజా వైద్య సమాచారం ప్రకారం చిన్నారి పరిస్థితి కాస్త మెరుగైనట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పశుపోషణలో బాధ్యత, పెంపుడు కుక్కల నియంత్రణ, చిన్నారుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. అయితే, ఇప్పటివరకు చిన్నారి కుటుంబం పోలీసులకు అధికారిక ఫిర్యాదు ఇవ్వలేదని సోనిపట్ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందితే తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
వైరల్ వీడియో ఇక్కడ చూడండి..
हरियाणा के सोनीपत की सिक्का कॉलोनी में एक दर्दनाक घटना सामने आई है, जहाँ एक पालतू पिटबुल कुत्ते ने छह महीने के एक मासूम बच्चे पर जानलेवा हमला कर दिया।
यह घटना 14 सितंबर की है। छह महीने का बच्चा अपनी बुआ की गोद में गली से गुजर रहा था, तभी पड़ोसी का दरवाजा खुलने पर वहां बंधा पिटबुल अचानक बाहर निकल आया और बच्चे पर झपट्टा मारकर उसे नीचे गिरा दिया।
बच्चे को बचाने की कोशिश में उसकी बुआ को भी कुत्ते ने जख्मी कर दिया। कुत्ता करीब आधे मिनट तक बच्चे को अपने जबड़े में दबाकर नोंचता रहा, जिसे बाद में बड़ी मुश्किल से एक युवक ने छुड़ाया।
इस भयानक हमले में बच्चे के चेहरे (गाल और माथे), हाथ, पैर और पेट पर गंभीर घाव आए हैं। पेट में गहरे जख्म होने के कारण दिल्ली के एक निजी अस्पताल में उसका ऑपरेशन किया गया, जहां उसे लगभग 20 टांके लगे।
अत्यधिक खर्च और स्थिति की गंभीरता को देखते हुए परिवार ने बच्चे को रोहतक पीजीआई (PGI Rohtak) में भर्ती कराया है, जहां उसका इलाज चल रहा है।
— Deepak (@Deepak_indskn) September 18, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..