Viral News: ఎంత కష్టమొచ్చింది పాపం.. పెళ్లికూతురిని ఎత్తుకోవడానికి వరుడు పడిన తంటాలు చూస్తే నవ్వాగదు..

కొన్ని సెకన్ల వీడియోకు వేల సంఖ్యలో వీక్షణలు వచ్చాయి. దీంతో నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు.

Viral News: ఎంత కష్టమొచ్చింది పాపం.. పెళ్లికూతురిని ఎత్తుకోవడానికి వరుడు పడిన తంటాలు చూస్తే నవ్వాగదు..
Groom Bride

Updated on: Jan 05, 2023 | 11:50 AM

వధూవరులు, వివాహ ఊరేగింపులకు సంబంధించి వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఇలాంటి వీడియోల్లో చాలా వరకు ఫన్నీ వీడియోలు, ఆశ్చర్యకరమైన వీడియోలే ఎక్కువగా ఉంటాయి. అవి చూసిన నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు. తాజాగా కూడా అలాంటి దృశ్యమే కనిపించింది. వైరల్ అయిన వీడియోలో, వరుడు హీరోలా బిల్డప్‌ ఇస్తూ పెళ్లి కూతుర్ని ఎత్తుకోవాలని ప్రయత్నించాడు. ఫలితంగా బంధుమిత్రులందరీ సమక్షంలో నవ్వులపాలయ్యాడు..పాపం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వధూవరుల మధ్య జయమాల కార్యక్రమం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. జయమాల ముగిసిన వెంటనే, వరుడు తన వధువును ఎత్తుకోవటం కోసం ట్రై చేస్తున్నాడు. వధువును ఎత్తుకోవాలనే ప్రయత్నం అతను మళ్లీ మళ్లీ చేస్తూ వచ్చాడు. కానీ, అతడు ఆమెను ఎత్తలేకపోయాడు. చివరికి అతను ఎలాగో వధువును ఎత్తుకున్నాడు, కానీ ఆమెను మోసుకుని నడవలేక కిందపడిపోయాడు పాపం..

హీరో కావాలనే కోరికతో వరుడు తన పెళ్లిలోనే తనను తాను ఎగతాళి చేసుకున్నాడనే చెప్పొచ్చు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో @HasnaZarooriHai అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేయబడింది. కొన్ని సెకన్ల వీడియోకు వేల సంఖ్యలో వీక్షణలు వచ్చాయి. దీంతో నెటిజన్లు విపరీతంగా నవ్వుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..