Viral Video: ఇదెక్కడి పిచ్చి రా బాబు.. పట్టు తప్పితే పెళ్లి కాస్తా పెటాకులయ్యేది.. వీడియో వైరల్..

|

Feb 25, 2022 | 5:14 PM

పెళ్లి.. రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది. ఇద్దరి మనసులను పసుపుతాడుతో బంధంగా మార్చేస్తుంది. తమ పెళ్లి గురించి ప్రతి ఒక్కరి ఎన్నో ఆశలతో ఉంటారు. బంధుమిత్రుల

Viral Video: ఇదెక్కడి పిచ్చి రా బాబు.. పట్టు తప్పితే పెళ్లి కాస్తా పెటాకులయ్యేది.. వీడియో వైరల్..
Viral Video
Follow us on

పెళ్లి.. రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది. ఇద్దరి మనసులను పసుపుతాడుతో బంధంగా మార్చేస్తుంది. తమ పెళ్లి గురించి ప్రతి ఒక్కరి ఎన్నో ఆశలతో ఉంటారు. బంధుమిత్రుల మధ్య అంగరంగా వైభవంగా జరగాలని.. సందడిగా.. రెండు కుటుంబాలు సంతోషంగా ఉండాలనుకుంటారు. తమ పెళ్లికి సంబంధించిన ప్రతి క్షణాన్ని జ్ఞాపకంగా చేసుకోవాలని ఆశపడుతుంటారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో పెళ్లి వీడియోస్ అధికంగా ఉంటున్నాయి. అందులో కొన్ని వీడియోస్ చూస్తే.. పెళ్లంటే ఇలా జరగాలి.. అనిపించేలా ఉండగా.. మరికొన్ని మాత్రం అయ్యో పాపం అనిపించేలా ఉంటాయి. ఇందుకు కారణం.. పెళ్లిలో జరిగే చిన్న చిన్న ఆసక్తికర సంఘటనలే. తాజాగా సోషల్ మీడియాలో ఓ పెళ్లి వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్.. ఇదెక్కడి పిచ్చి రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంటీ.. ఎందుకు అలా చేస్తున్నారు అనుకుంటున్నారా ? అయితే ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందామా.

ఆ వీడియోలో.. పెళ్లి తంతు జరిగిన తర్వాత వధువు, వరుడు వరమాలలు మార్చుకునే ఆచారం ప్రారంభమైంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న బంధువులు వధూవరులిద్దరినీ అమాంతం పైకి ఎత్తి పట్టుకున్నారు. వారిద్దరూ స్టేజ్ పై ఉన్న ఐరన్ ఫ్రేమ్‏ను పట్టుకుని నిల్చునేందుకు ట్రై చేశారు. ఇక ఇదే హాడావిడిలో వరుడు వధువు మెడలో సులభంగా వరమాల వేశాడు.. కానీ.. పాపం వధువు… వరుడి మెడలో వరమాల వేయడానికి చాలా కష్టపడింది. వరుడి షర్ట్ పట్టుకుని తనవైపు లాక్కుంటూ మెడలో వరమాలను విసిరివేసి.. ఆ తర్వాత వరమాలను సెట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాస్తా పట్టు తప్పితే పెళ్లి కాస్తా పెటాకులయ్యేది.. పిచ్చి అంటే వినటమే.. కానీ చూస్తున్నాను.. దేవుడా.. ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి వాళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Bheemla Nayak Review: స‌మ్మర్ సినిమాల‌కు శుభారంభం.. భీమ్లా నాయ‌క్‌.. పర్‌ఫెక్ట్‌ మూవీ రివ్యూ..

Ram gopal Varma: ‘భీమ్లా నాయక్‌ ఒక భూకంపం.. హిందీలో విడుదల చేయాల్సిందే’.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్‌.. ఏమన్నారంటే..

Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా