Baba Vanga: వామ్మో.. బంగారం అంత పెరుగుతుందా..? బాబా వంగా సంచలన జోస్యం..

తులం బంగారం రూ. 2 లక్షలు.. వినడానికి ఇది అసాధ్యంగా అనిపించినా.. ప్రపంచ ప్రఖ్యాత ప్రవక్త బాబా వంగా అంచనాల ప్రకారం 2026లో ఇదే జరగబోతోందట. ఒకవైపు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నా, ఆశ్చర్యకరంగా తగ్గుతున్న ప్రస్తుత ధరలు పసిడి ప్రియులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇది భారీ పెరుగుదలకు ముందు కనిపిస్తున్న నిశబ్దమా? అసలు బాబా వంగా చెప్పిన ఆ ఆర్థిక సంక్షోభం నిజం కాబోతోందా?

Baba Vanga: వామ్మో.. బంగారం అంత పెరుగుతుందా..? బాబా వంగా సంచలన జోస్యం..
Baba Vanga Gold Prediction

Updated on: Apr 04, 2026 | 9:05 AM

భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్, సురక్షితమైన పెట్టుబడి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తున్న వేళ పసిడి ధరల పరుగు మధ్యతరగతి ప్రజలను కలవరపెడుతోంది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, యుద్ధ వాతావరణం, భవిష్యత్తుపై వెలువడుతున్న కొన్ని సంచలన అంచనాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, పెట్టుబడిదారులు సురక్షిత మార్గంగా భావించి బంగారంపై పెట్టుబడులు పెంచుతారు. దీనివల్ల ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తుండటం ఆర్థిక విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇది ధరలు పెరగడానికి ముందు కనిపిస్తున్న నిశ్శబ్దమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

2026పై బాబా వంగా దిగ్భ్రాంతికర అంచనాలు

ప్రపంచ ప్రఖ్యాత బల్గేరియన్ ప్రవక్త, బాల్కన్స్ నోస్ట్రాడమస్‌గా పిలవబడే బాబా వంగా 2026 సంవత్సరం గురించి చేసిన కొన్ని అంచనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2026లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని, దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలు పతనం కావచ్చని ఆమె హెచ్చరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగితపు కరెన్సీపై నమ్మకం పోయినప్పుడు, అందరూ బంగారం వైపే మొగ్గు చూపుతారని, ఫలితంగా పసిడి ధరలు 25శాతం నుండి 40శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. ఈ అంచనాలు గనుక నిజమైతే, ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1.9 లక్షల నుండి రూ. 2.1 లక్షల వరకు చేరే ప్రమాదం ఉంది.

ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు?

బాబా వంగా అంచనాలు ఎలా ఉన్నా, మార్కెట్ నిపుణులు మాత్రం పసిడి ధరలు కేవలం పుకార్లపై ఆధారపడి ఉండవని స్పష్టం చేస్తున్నారు.

  • అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, గ్లోబల్ వడ్డీ రేట్లు బంగారం ధరను శాసిస్తాయి.
  • రూపాయి విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల కూడా బంగారం భారమవుతుంది.
  • మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు సద్దుమణిగితే, ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పుడు కొనాలా? వద్దా?

బంగారం ఎల్లప్పుడూ ఒక సురక్షితమైన పెట్టుబడే. అయితే బాబా వంగా అంచనాల నేపథ్యంలో ధరలు పెరుగుతాయని భయపడి భారీగా పెట్టుబడులు పెట్టే ముందు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను గమనించడం ముఖ్యం. మీ ఆర్థిక ప్రణాళికకు అనుగుణంగా, నిపుణుల సలహాతో నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Follow Us