Viral Video: అమ్మో బొమ్మ.. సడెన్‌గా చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం.. ఇదేం క్రియేటీవీటీ రా బాబూ..!

Scarecrow Video: సోషల్ మీడియాలో నిత్యం మనం ఎన్నో వీడియోలను చూస్తుంటారు. చాలా వీడియోలు సరదాగా, ఫన్నీగా ఉంటాయి. కానీ ఇప్పుడు..

Viral Video: అమ్మో బొమ్మ.. సడెన్‌గా చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం.. ఇదేం క్రియేటీవీటీ రా బాబూ..!
Scarecrow

Updated on: Jul 12, 2021 | 10:13 PM

Scarecrow Video: సోషల్ మీడియాలో నిత్యం మనం ఎన్నో వీడియోలను చూస్తుంటారు. చాలా వీడియోలు సరదాగా, ఫన్నీగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చూడబోయే వీడియో మాత్రం ఖచ్చితంగా హడలెత్తిస్తుంది. అమ్మో ఏం బొమ్మ రా బాబూ అనే ఫీలింగ్‌ను కలిగిస్తుంది. తాజా ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిన్న క్లిప్పే అయినా.. ఎక్కువ మంది నెటిజన్లను ఆకట్టుకుంటుంది. భయపెట్టే వీడియో అయినా.. నెటిజన్లను తనవైపు లాక్కుంటోంది.

సాధారణంగా.. పక్షులు, అడవి జంతువుల నుంచి నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు తమ వ్యవసాయక్షేత్రాల్లో దిష్టి బొమ్మలను ఏర్పాటు చేస్తారనే విషయం తెలిసిందే. వాటిని చూసి పక్షులు, జంతువులు భయపడి పంట పొలాల్లోకి రాకుండా ఉంటాయని రైతులు విశ్వసిస్తారు. ఆమేరకు వాటికి భయం కలిగే రీతిలో దిష్టి బొమ్మలను భయంకరంగా ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఒక కర్రకు తల మాదిరిగా కుండను పెట్టి.. ఆ కర్రకు పాత డ్రెస్ తొడిగి దిష్టిబొమ్మను ఏర్పాటు చేస్తారు. మరికొందరు.. తమ పొలాల్లో మెరిసే పాలిథిన్ పేర్లను కర్రలకు ఏర్పాటు చేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవల్ దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు. దీనిని చూస్తే జంతువులు, పక్షులే కాదు.. ఏకంగా మనుషులు కూడా ఆ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేందుకు సాహసించరంటే అతిశయోక్తి కాదు.

అవునండి బాబూ.. ఈ వీడియోను చూస్తే మీరు కూడా అలాగే అంటారు మరి. ఈ దిష్టిబొమ్మను ఎవరూ ఊహించని రీతిలో చేశారు. నిటారుగా ఉన్న ఓ స్ప్రింగ్‌కు బైక్ హ్యాండిల్ ఏర్పాటు చేశారు. ఆ హ్యాండిల్‌ను దిష్టిబొమ్మ పట్టుకునేలా ఏర్పాటు చేశారు. భయానకమైన మొహం, తలపై ఎర్ర కండువా, చొక్కా, లంగా ధరించి దిష్టిబొమ్మను ఒక దెయ్యం మాదిరిగా తయారు చేశారు. స్ప్రింగ్ యాక్షన్ ఉన్న కర్రను అది పట్టుకున్నట్లుగా ఏర్పాటు చేయడంతో.. అది నిరంతరం పైకి కిందకి ఊగుతోంది. అది చూడటానికి దెయ్యం మాదిరిగా కనిపిస్తోంది. రాత్రి సమయంలో ఎవరైనా తెలియని వారు ఆ వ్యవసాయ క్షేత్రాని వెళితే మాత్రం గుండెపోవడం ఖాయం అనే చెప్పాలి. ఈ భయంకరమైన దిష్టిబొమ్మకు సంబంధించిన 9 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 2 లక్షల మందికిపైగా వీక్షించారు. నెటిజన్లు ఈ దెయ్యం దిష్టిబొమ్మను చూసి హడలిపోతున్నారు. దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ స్కేరీ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

INDW vs ENGW: రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన భారత యువ సంచలనం.. 18 ఏళ్లు నిండకుండానే నెంబర్ వన్..! ఎందులోనో తెలుసా?

Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ధర్మశాలలో ఆకస్మిక వరదలు.. మహారాష్ట్రలో కుండపోత వర్షాలు

Loading...
Unable to load recommendations.
Follow Us