మట్టిలో మాణిక్యాలు అని ఊరికే అంటారా ? ఆలోచించాలే గానీ.. మన చుట్టూ ఉన్న వస్తువులతో ఎన్ని ఉపయోగాలున్నాయో అర్థమవుతుంది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగంలో టెక్నాలజీని వాడకంలో మనం ముందుంటాం. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా.. తమ ఆలోచనతో టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కొందరు వినూత్న దారిని అవలంభిస్తుంటారు. రెగ్యూలర్గా చేసే పని అయినా.. ఆలోచన జోడిస్తే.. అధ్భుత ఫలితాలను కలుగుతాయి. శరీరానికి ఎక్కువగా శ్రమ కలగకుండానే.. కఠిన పనులను కూడా సులభంగా పూర్తిచేయవచ్చు. ఏంటీ ఇంతగా.. దేని గురించి చెప్తుంది అనుకుంటున్నారా ? ఇప్పుడు ఓ రైతుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అతడు చేసిన పనికి.. అతని ఆలోచనకు కచ్చితంగా ఫిదా అవుతారు. ఇంతకీ ఆ రైతు ఏం చేసాడో తెలుసుకుందామా.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ రైతుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. అందులో అతను తన తెలివితో వినుత్న పనికి శ్రీకారం చుట్టారు. చెట్టు నుంచి మట్టిని వేరు చేయడానికి తన బైక్ను ఉపయోగిస్తున్నాడు. బైక్ స్టార్ట్ చేసి.. కదులుతున్న చక్రంలో మొక్కల మొదళ్లను పెట్టగానే.. వాటికి ఉన్న మట్టి సులభంగా వదిలిపోతుంది. దీంతో అతడికి పెద్దగా శ్రమ లేకుండానే.. కొన్ని మొక్కల నుంచి సులభంగా మట్టిని వేరు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని ఆలోచన విధానానికి ఫిదా అవుతున్నారు. ఆ వీడియోను మీరు చూసెయ్యండి..
Also Read: Love Story: లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్.. ముఖ్య అతిధిగా ఎవరు హాజరువుతున్నారో తెలుసా.?
Maha Samudram: ఓటీటీలోకి మహా సముద్రం.. ? శర్వానంద్ సినిమా కోసం ఎన్ని కోట్లు ఆఫర్ అంటే..