Anand Mahindra – Viral: ‘ప్లీజ్ అలా చేయకండి’.. ఆనంద్ మహీంద్ర రిక్వెస్ట్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

| Edited By: Team Veegam

Jul 23, 2022 | 4:18 PM

Anand Mahindra - Viral Video: భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన SUVలలో మహీంద్రా థార్ ఒకటి. స్టైలిష్ లుక్, సౌకర్యవంతమైన సీట్లు, అదిరిపోయే ఫీచర్లతో

Anand Mahindra - Viral: ‘ప్లీజ్ అలా చేయకండి’.. ఆనంద్ మహీంద్ర రిక్వెస్ట్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
Anand Mahindra
Follow us on

Anand Mahindra – Viral Video: భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన SUVలలో మహీంద్రా థార్ ఒకటి. స్టైలిష్ లుక్, సౌకర్యవంతమైన సీట్లు, అదిరిపోయే ఫీచర్లతో 2020లో మార్కెట్‌లోకి వచ్చింది. అప్పటి దాని క్రేజ్ అమాంతం పెరుగుతూనే ఉంది. మార్కెట్‌లోకి విడుదలైనప్పటి నుంచి అత్యధికంగా అమ్ముడైన SUVలలో ఒకటిగా థార్ నిలిచింది. థార్ ముఖ్యంగా ఆఫ్-రోడ్ ప్రయాణాలకు ప్రసిద్ధి చెందింది.

దీని ఫోర్-వీల్ డ్రైవ్ సామర్ధ్యం.. అడ్వెంచర్ కోరుకునే వారికి ఫస్ట్ ఛాయిస్ SUVగా నిలుస్తోంది. దీని సామర్థ్యాన్ని చూపే యాక్షన్-ప్యాక్డ్ వీడియో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో వైరల్ అయ్యింది. ఈ వీడియో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కంట పడింది. దాంతో ఆ వీడియోపై ఆయన రియాక్ట్ అయ్యాడు. ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ.. ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో థార్ రైడర్స్‌కి కీలక సూచనలు, రిక్వెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఆనంద్ మహీంద్ర ఎందుకంత కంగారు పడ్డారు? అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో గోవాలోని కొలెంలోని దూద్‌సాగర్ నది ప్రవాహం ఉధృతంగా ఉండగా.. ఆ నీటి ప్రవాహం గుండా రెండు మహీంద్రా థార్‌లు నడుపుతున్నారు. నదిని దాటే క్రమంలో రెండు థార్ లు సగం వరకు మునిగిపోయాయి. అయితే, ఈ రెండూ ఎలాంటి అవాంతరాలు లేకుండానే నదిని దాటేశాయి. అయితే, వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర.. ఇది అత్యంత ప్రమాదకరమైందని, ఇలాంటి పునరావృతం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

‘‘ఇవాళ ఉదయం నా ఇన్‌బాక్స్‌లో ఈ పోస్ట్ దొరికింది. థార్‌పై వారి విశ్వాసాన్ని నేను అభినందిస్తున్నాను. అయితే, ఇది చాలా ప్రమాదకరమైన చర్యగా కనిపిస్తోంది. కాస్తా ఓపిక పట్టాలని థార్ యజమానులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని ఆనంద్ మహీంద్ర తన ట్వీట్‌లో రిక్వెస్ట్ చేశారు. కాగా, ఆనంద్ మహీంద్ర ట్వీట్ పై నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. ‘ఖచ్చితంగా ఇది ప్రమాదకరమైనది. అయతే, 4×4లో సాధ్యమే. సమర్థమైన డ్రైవర్ చేతిలో స్టీరింగ్ ఉంటే ఏ సమస్యా లేదు. కూల్ హెడ్’ అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టారు. ఆనంద్ మహీంద్రా ట్వీట‌ను రీట్వీట్ చేసిన మరొక నెటిజన్.. ‘సరైన సమయంలో సరైన సలహా ఇచ్చారు సర్.. ఇలాంటి సమయంలో స్టంట్స్ చేయొద్దు.’ అని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..