ఆవకాయను తెగ కుమ్మేసింది.. కట్ చేస్తే.. గొంతునొప్పితో ఆసుపత్రిలో చేరింది.. తీరా సిటీ స్కాన్‌లో..

|

Nov 09, 2022 | 6:28 PM

ఎవరికైనా కూడా ఆవకాయ పేరెత్తితే చాలు.. నోరూరిపోతుంది. అలాంటిది ఆవకాయ ఓ మహిళను ఏకంగా ఆసుపత్రి పాలయ్యేలా చేసింది.

ఆవకాయను తెగ కుమ్మేసింది.. కట్ చేస్తే.. గొంతునొప్పితో ఆసుపత్రిలో చేరింది.. తీరా సిటీ స్కాన్‌లో..
Mango Pickle
Follow us on

ముద్దపప్పు.. కొత్త ఆవకాయ.. ది పర్ఫెక్ట్ కాంబినేషన్ కదండీ.. ఎవరికైనా కూడా ఆవకాయ పేరెత్తితే చాలు.. నోరూరిపోతుంది. అలాంటిది ఆవకాయ ఓ మహిళను ఏకంగా ఆసుపత్రి పాలయ్యేలా చేసింది. ఈ ఘటన ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అసలేం జరిగిందంటే.. ఇంగ్లాండ్‌కు చెందిన 57 ఏళ్ల మహిళకు కొత్త ఆవకాయ అంటే భలే ఇష్టం. ఓ రోజు ఆవకాయ వేసుకుని తింటున్నప్పుడు పొరపాటున ఆవకాయబద్ద కాస్తా నోట్లో ఇరుక్కుపోయింది. వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చేరింది. అక్కడున్న వైద్యులకు అసలు విషయం చెప్పి.. తన పరిస్థితి ఇదీ అని వివరించింది.

ఇవి కూడా చదవండి

వైద్యులు మాత్రం మామిడి టెంక గొంతులో ఇరుక్కోవడం ఏంటని.. అలా ఏమై ఉండదని.. మహిళను పరీక్షించి.. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నా.. ఇలానే ఉంటుందని చెప్పి.. మందులిచ్చి పంపించారు. అయితే సదరు మహిళ మరో నాలుగు రోజులకే తినలేకపోతున్నాను.. తాగలేకపోతున్నాను.. భరించలేని నొప్పిగా ఉందంటూ ఆసుపత్రిలో జాయిన్ అయింది. దీంతో సీటీ స్కాన్ తీసిన డాక్టర్లు.. ఆవకాయబద్ద గొంతులో గుచ్చుకోవడంతో అన్నవాహికలో నీరు, ఛాతీలో గాలి చేరడాన్ని గుర్తించారు. దీంతో ఆమెకు వెంటనే శస్త్రచికిత్స చేసి.. గొంతులో ఇరుక్కున్న ఆవకాయబద్దను బయటికి తీశారు డాక్టర్లు.