Viral Video: చిన్నారితో పోటీపడి డ్యాన్స్ చేసిన ఏనుగు.. ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో..

|

Sep 18, 2022 | 11:17 AM

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. చిన్నారితోపాటు ఏనుగు డాన్స్ వీడియో ఆకట్టుకుంటుంది.

Viral Video: చిన్నారితో పోటీపడి డ్యాన్స్ చేసిన ఏనుగు.. ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో..
Viral
Follow us on

ఏనుగు చేసే పనులు చూసేందుకు ఎంతో ముచ్చటేస్తుంటాయి. ముఖ్యంగా మనుషులు.. చిన్నారులతో ఏనుగులు ఆడే సరదా ఆటలకు సంబంధించిన వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. అంతేకాదు.. మనుషుల హావాభావలకు తగినట్టుగానే ఏనుగులు కూడా ప్రవర్తించడం ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ ఏనుగు ఓ అమ్మాయితో కలిసి ఎంతో అందంగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. చిన్నారితోపాటు ఏనుగు డాన్స్ వీడియో ఆకట్టుకుంటుంది.

ఆ వీడియోలో ఓ పెద్ద ఏనుగు ముందు నిల్చున్న క్యూట్ పాప సరదాగా డ్యాన్స్ చేసింది. అది చూసిన ఏనుగు సైతం తన చెవులను ఆడిస్తూ చిన్నారికి జత కలిపింది. ఈ క్యూట్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇందులో ఎవరు బాగా చేశారు అంటూ క్యాప్షన్ ఇవ్వగా.. ఇద్దరు అద్భుతంగా చేశారంటూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.