
సూర్యుడి నుంచి భారీ మొత్తంలో శక్తి, కణాలు అంతరిక్షంలోకి విడుదలయ్యాయి. వీటిలో ముఖ్యమైంది కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME). ఈ ప్రక్రియలో సూర్యుడి బయటి వాతావరణం నుంచి భారీ మొత్తంలో ప్లాస్మా, అయస్కాంత పదార్థాలు భూమిని చేరినప్పుడు భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పు వస్తుంది. ఈ పరిణామాన్ని భూ అయస్కాంత తుపాను లేదా జియోమాగ్నెటిక్ స్టార్మ్ అంటారు. ఉపగ్రహాలు, రేడియో కమ్యూనికేషన్లు, నావిగేషన్ వ్యవస్థలు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు తాత్కాలికంగా పని చేయకుండా పోయే అవకాశం ఉంది.
సౌర జ్వాలల ప్రభావం వల్ల భూమిపై ‘రేడియో బ్లాక్ అవుట్’ తలెత్తే ప్రమాదం ఉందని ఇస్రో హెచ్చరించింది. అంటే మనం రోజూ వాడే హై-ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లు, విమానయాన రంగంలో కమ్యూనికేషన్ కు ఇబ్బందులు కలగడమే కాకుండా.. సముద్రంలో ప్రయాణించే నౌకల రాడార్ వ్యవస్థలు దెబ్బతింటాయి. అంతే కాకుండా విద్యుత్ గ్రిడ్లు పనిచేయక పోవడం, జీపీఎస్ నావిగేషన్ సిగ్నల్స్ తారుమారు కావడం జరగవచ్చు. దీని వల్ల సామాన్యుల ఫోన్ సిగ్నల్స్, టీవీ ప్రసారాలకు కూడా కొంతవరకు అంతరాయం కలుగుతుంది.
భూమికి మధ్యస్థ స్థాయి G2 భూ అయస్కాంత తుపాను ముప్పు పొంచి ఉందని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) హెచ్చరించింది. అయితే, భూమిపై ఈ తుపాను ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది సూర్యుడి నుంచి వచ్చిన పదార్థాలు భూమి అయస్కాంత క్షేత్రంతో కలవడంపై ఆధారపడి ఉంటుందనీ తెలిపింది.
🚨 The Sun just fired off a powerful M6.7 flare, blasting plasma into space and destabilizing a nearby filament. ☀️😳
And another solar storm is already heading our way, while effects from an earlier CME are expected today, Oct. 9.
The Sun is seriously active right now. https://t.co/gVSQFUiUra
— Mindbeast (@mindbeast) October 9, 2026
సూర్యుడిపై జరిగే భారీ విస్ఫోటనాల సమయంలో పెద్ద మొత్తంలో కణాలు, అయస్కాంత పదార్థాలు అంతరిక్షంలోకి విడుదలవుతాయి. ఈ పదార్థాలు భూమిని చేరినప్పుడు భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. ఈ పరిణామాన్నే భూ అయస్కాంత తుపాను (Geomagnetic Storm) అంటారు.
భూ అయస్కాంత తుపానుల తీవ్రతను NOAA ఐదు స్థాయిల్లో G1 నుంచి G5 వరకు వర్గీకరించింది. G1 అత్యల్ప తీవ్రత కలిగిన తుపాను కాగా, G5 అత్యంత తీవ్రమైన తుపాను స్థాయి. స్థాయి పెరిగే కొద్దీ ఉపగ్రహాలు, విద్యుత్ వ్యవస్థలు, రేడియో కమ్యూనికేషన్లు, నావిగేషన్ సేవలపై ప్రభావం పడే అవకాశం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం జారీ చేసిన G2 హెచ్చరిక మధ్యస్థ స్థాయి తుపానుకు సంబంధించింది.