Viral Video: ఉప్పుతో గీసిన వలయాన్ని నాగుపాము దాటలేదా.? ఇదిగో క్లారిటీ..

పాము పేరు చెబితేనే చాలు.. చాలామంది వెన్నులో వణుకుపుడుతుంది. పాము కళ్లెదుటే కాదు.. కలలో కనిపించినా కూడా అలాంటివారికి గుండె ఆగినంత పనవుతుంది.

Viral Video: ఉప్పుతో గీసిన వలయాన్ని నాగుపాము దాటలేదా.? ఇదిగో క్లారిటీ..
Viral

Updated on: Jun 12, 2023 | 1:54 PM

పాము పేరు చెబితేనే చాలు.. చాలామంది వెన్నులో వణుకుపుడుతుంది. పాము కళ్లెదుటే కాదు.. కలలో కనిపించినా కూడా అలాంటివారికి గుండె ఆగినంత పనవుతుంది. ఇక ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాముల్లో నాగుపాము ఒకటి. ఈ విషపూరితమైన పాము చుట్టూ ఎన్నో కధలు, పురాణాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నాగుపాముకు సంబంధించి అనేక అపోహలు చక్కర్లు కొడుతుంటాయి. అలా చేస్తే మన దరికి చేరదని.. ఇలా చేస్తే దడుసుకుంటుందంటూ.. అనేకం చెలామణి అవుతుంటాయి. ఇందులో ఒకటి ఇంటి చుట్టూ ఉప్పుతో గీసిన వలయాన్ని పాములు రాలేవు. ఇది ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో నాగుపాము గురించి చెలామణి అవుతున్న అపోహ. ఇక ఇందులో ఎంత నిజముందో ఓ యూట్యూబర్ చేసి చూపించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. అమిత్ కుమార్ అనే యూట్యూబర్ ఉప్పుతో ఓ గీత గీశాడు. ఆ తర్వాత దాని మధ్యలో రెండు నాగుపాములను వదిలాడు. ఇక అందులోని ఓ నాగుపాము కొద్దిసేపటికే ఆ ఉప్పు వాలయాన్ని దాటుకుని బయటికి రాగా.. ఇంకో నాగుపాము కాసేపటి తర్వాత బయటకు వచ్చింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమిత్ చేసే ప్రయత్నాలు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us