Viral News: తండ్రి చనిపోయిన 9 ఏళ్ల తర్వాత కూతురికి చేరిన ఆయన రాసిన ఉత్తరం.. అందులో ఏముందంటే..?

|

Aug 18, 2022 | 10:23 AM

తన తండ్రి మరణించిన 9 ఏళ్ల తర్వాత అతను రాసిన ఉత్తరం తన వద్దకు చేరింది. దీంతో ఆ కూతురు సంతోషానికి అవధులు లేవు. తన తండ్రి రాసిన ఉత్తరంతోపాటు.. ఆయనతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

Viral News: తండ్రి చనిపోయిన 9 ఏళ్ల తర్వాత కూతురికి చేరిన ఆయన రాసిన ఉత్తరం.. అందులో ఏముందంటే..?
Viral
Follow us on

పిల్లలపై తల్లిదండ్రులు చూపించే ప్రేమ వర్ణానాతీతం. తమ పిల్లల ఎదుగుదల కోసం ఎన్నో కష్టాలతో పోరాడుతుంటారు. ఎంతో ప్రేమను.. ప్రోత్సాహాన్ని అందించే పేరెంట్స్ ఆకస్మాత్తుగా ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోతే ఆ మనోవేదన భరించడం చాలా కష్టం. తల్లి లేదా తండ్రి మరణించిన తర్వాత వారికి సంబంధించిన జ్ఞాపకాలు, వస్తువులు తమ వద్దకు చేరితే ఆ సంతోషం మాటల్లో చెప్పలేం. అంత గొప్ప ఆనందాన్ని వర్ణించడానికి క్షణం సరిపోదు. అలాంటి ఓ ఘటన ఓ అమ్మాయి జీవితంలో జరిగింది. తన తండ్రి మరణించిన 9 ఏళ్ల తర్వాత అతను రాసిన ఉత్తరం తన వద్దకు చేరింది. దీంతో ఆ కూతురు సంతోషానికి అవధులు లేవు. తన తండ్రి రాసిన ఉత్తరంతోపాటు.. ఆయనతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ లూయిస్ విల్లేలో ప్రొఫెసర్‏గా పనిచేస్తున్న అమీ క్లూకీ తన తండ్రికి సంబంధించిన తేనెటీగల పెంపకం పరికరాలను చూస్తుకుంటుంది. అదే సమయంలో ఆమెకు ఓ ఉత్తరం వచ్చింది. జూలై 27, 2012న తేనెటీగల పెంపకంపై వారి పిల్లలకు ఉన్న ఆసక్తిని కలిగించేందుకు ప్రయత్నించింది. ఆ ఉత్తరంలో ఏముందంటే..

ఇవి కూడా చదవండి

” తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న నా పిల్లల్లో ఒకరికి ఈ ఉత్తరం అందింది అనుకుంటున్నాను. తేనెటీగల పెంపకం అనేది చాలా సులభం. ఆన్ లైన్ ద్వారా మీరు ప్రతి విషయాన్ని నేర్చుకోవచ్చు. తేనెటీగలు కేవలం తేనెను ఎక్కువ చేస్తాయి. అలాగే ఇది ఒక అభిరుచి.. ఎక్కువ నగదు సంపాదించేందుకు సహయపడుతుంది. మీరు భయపడకండి. ఎప్పుడు ధైర్యంగా ఉండండి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. లవ్ డాడ్” అని అతని సంతకం పెట్టి ఉంది.

తన తండ్రి మరణించిన తర్వాత ఈ ఉత్తరం తనకు చేరిందని తెలుపుతూ.. అతడితో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అమీ క్లూకీ తండ్రి పేరు రిక్ క్లోకీ. అతను 2013లో 53 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించాడు. వారికి 6గురు పిల్లలున్నారు. అందులో క్లోకీ పెద్దది. ఆమె తన తమ్ముడు లియామ్ కలిసి తేనెటీగల పెంపకం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.