Viral Video: ఐసీయూలో ఎటుచూసినా నిశ్శబ్దం.. తీరా సీసీటీవీ చూడగా గుండె గుభేల్

ఆత్మా.? లేక జిన్..? లేదా మరేదైనా.. ఓ హాస్పిటల్ ఐసీయూలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పేషెంట్ బెడ్‌కు పక్కనే పిల్లాడి రూపంలో ఓ నల్లటి ఆకారం కనిపించింది. అదేంటి అని చూడగా.. సీసీటీవీ చూడగానే దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు..

Viral Video: ఐసీయూలో ఎటుచూసినా నిశ్శబ్దం.. తీరా సీసీటీవీ చూడగా గుండె గుభేల్
Viral Video

Updated on: Nov 11, 2025 | 12:59 PM

ఆత్మల కాన్సెప్ట్ అనేది బోర్ కొట్టని సబ్జెక్ట్. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే ఉంటాయి. ఇంటర్నెట్ వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం నలుమూలల జరిగిన ప్రతీ విషయం మన చేతుల్లోకి ఇట్టే వచ్చేస్తుంది. సరిగ్గా అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చోటు చేసుకుంది. దాన్ని మీరు చూశారంటే.. దెబ్బకు దడుసుకోవడం ఖాయం. మీ వెన్నులో వణుకుపుట్టాల్సిందే. లేట్ ఎందుకు ఆ వీడియోపై ఓసారి లుక్కేయండి.

వీడియో ప్రకారం.. ఐసీయూ రూమ్‌ నిశ్శబ్దంగా ఉంటుంది. రోగులను కలుసుకునేందుకు తమ కుటుంబీకులు వస్తూపోతుంటారు. అయితే మీరు సరిగ్గా వీడియో చూస్తే ఓ పేషెంట్ బెడ్ దగ్గర బాలుడి రూపంలో నల్లటి ఆత్మ కనిపిస్తుంది. దాన్ని దాటుకుని ఓ వ్యక్తి వస్తాడు కూడా. సీసీటీవీలో ఆ దృశ్యాలు చూసినవారు దెబ్బకు దడుసుకున్నారు. మలేషియాలోని లబుయన్‌లో ఉన్న ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురు నర్స్‌లు ఆ పిల్లాడి ఆత్మను చూసినట్టు చెప్పారు. అలాగే ఆ బెడ్‌పై ఉన్న మహిళా రోగి.. తాను కూడా ఓ బాలుడి రూపాన్ని చూశానని పేర్కొంది. కట్ చేస్తే.! ఆమె తర్వాతి రోజే చనిపోయింది. ఇక వారి పిల్లలు సీసీటీవీ ఫుటేజ్ చూడగా దెబ్బకు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.