అద్భుతం.. నగరం నడిఒడ్డున నాగుపాముల సయ్యాట.. ఆశ్చర్యంగా తిలకంచిన జనాలు.. ఇదిగో వీడియో

హైదరాబాద్‌లోని GHMC కార్యాలయంలో రెండు నాగు పాములు నృత్యం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా పంట పొలాల్లో కనిపించే ఈ అరుదైన దృశ్యం, నగరంలో ఒక కార్యాలయ ఆవరణలో చోటు చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిబ్బంది దీనిని తమ ఫోన్లలో చిత్రీకరించడంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అద్భుతం.. నగరం నడిఒడ్డున నాగుపాముల సయ్యాట.. ఆశ్చర్యంగా తిలకంచిన జనాలు.. ఇదిగో వీడియో
Cobra Dance Hyderabad Video

Updated on: Jun 03, 2026 | 10:38 AM

సాధారణంగా నగరాల్లో పాములు ఎక్కువగా కనిపించవు.. ఏదో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటి కాదు రెండు పాములు ఒకేసారి కనిపించాయి. అదికూడా నార్మల్‌గా కాదు.. రెండు నాగుపాములు నృత్యం చేస్తూ జనాలకు దర్శనమిచ్చాయి. పాములు అంటే భయమున్నప్పటికీ ఆ దృశ్యాన్ని చూసేందుకు జనాలు ఎంతగానో ఆసక్తి చూపారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మున్సిపల్ ఆఫీస్‌లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం సిబ్బంది అంతా ఎవరి పనిలో వాళ్లు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఆఫీస్‌ ఆవరణలో ఉన్న గార్డెన్‌లోంచి వాళ్లకు ఏవో వింత శబ్దాలు వినిపించాయి. ఏంటా అని ఓ ఉద్యోగి బయటకు వచ్చి చూశాడు. అక్కడ కనిపించిన సీన్ చూసి అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అక్కడ రెండు నాగుపాములు నృత్యం చేస్తూ కనిపించాయి.

వెంటనే అతను ఇతర సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేశాడు. ఒకవైపు పాములు అంటే భయం ఉన్నప్పటికీ.. మరోవైపు అవి చేస్తున్న నృత్యాన్ని చూసేందుకు అక్కడి సిబ్బంది ఆసక్తి చూపించారు. పై ఫ్లోర్ నుంచి కిందకు వచ్చి మరీ వాటి నృత్యాన్ని తిలకించారు. చాలా రేర్‌గా కనిపించే ఈ సీన్‌ను సిబ్బంది తమ ఫోన్లలో బంధించి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్‌ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు పంట పొలాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ సిటీలో ఇలా పాములు నృత్యం చేయడం ఇదే తొలిసారి చూస్తున్నానని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అబ్బా చూడ్డానికి రెండు కళ్లు చాలట్లేవని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us