Viral Video: ప్ర‌కృతి అద్భుతానికి నిద‌ర్శ‌నం ఈ అంద‌మైన దృశ్యం.. వైర‌ల్ వీడియో చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే..

|

Nov 04, 2021 | 10:52 AM

Viral Video: ఎన్నోఅద్భుత‌ అందాల‌కు ప్ర‌కృతి కేరాఫ్ అడ్ర‌స్‌. మాట్ల‌లో వ‌ర్ణించ‌లేని ఎన్నో అందాల‌ను త‌న‌లో ఇముడ్చుకుంటుంది ప్ర‌కృతి. అందుకే ఏ క‌వి హృద‌యం స్పందించాల‌న్నా ప్రకృతే స్ఫూర్తి. ఒక్క‌సారి అంద‌మైన ప‌రిస‌రాల‌ను...

Viral Video: ప్ర‌కృతి అద్భుతానికి నిద‌ర్శ‌నం ఈ అంద‌మైన దృశ్యం.. వైర‌ల్ వీడియో చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే..
Viral Video
Follow us on

Viral Video: ఎన్నోఅద్భుత‌ అందాల‌కు ప్ర‌కృతి కేరాఫ్ అడ్ర‌స్‌. మాట్ల‌లో వ‌ర్ణించ‌లేని ఎన్నో అందాల‌ను త‌న‌లో ఇముడ్చుకుంటుంది ప్ర‌కృతి. అందుకే ఏ క‌వి హృద‌యం స్పందించాల‌న్నా ప్రకృతే స్ఫూర్తి. ఒక్క‌సారి అంద‌మైన ప‌రిస‌రాల‌ను మ‌న‌సులోకి త‌లుచుకుంటే క‌విత ఉప్పొంగాల్సిందే. ఈ భూమి మీద ఉన్న ఎన్నో సుంద‌ర దృశ్యాలు మ‌న‌సును త‌ట్టిలేపుతుంటాయి. ప్ర‌స్తుత రోజుల్లో సోష‌ల్ మీడియా ఇలాంటి ఎన్నో అపురూప‌మైన వీడియోల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతోంది.

ఎక్క‌డ ఏ సుంద‌ర దృశ్యం క‌న‌బ‌డుతున్నా వాటిని వెంట‌నే కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు ఇట్టే ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోష‌ల్ మీడియాను చుట్టేస్తోంది. నేపాల్‌లో చోటుచేసుకున్న ఈ సుంద‌ర దృశ్యం చూప‌రుల‌ను క‌ట్టిప‌డేస్తోంది. రెండు పెద్ద ప‌ర్వ‌తాల న‌డుమ నుంచి మేఘాల రూపంలో ఉన్న హిమ‌పాతం దూసుకొస్తున్నస‌మ‌యంలో కొంద‌రు ఔత్సాహిక ప‌ర్యాట‌కులు త‌మ కెమెరాల్లో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన నెట‌జ‌న్లు ప్రకృతి అందాన్ని చూసి ప‌ర‌వ‌శించి పోతున్నారు. మ‌రి ఈ అద్భుత దృశ్యంపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Samantha: టపాసులను బ్యాన్ చేయకండి.. సద్గురు మాటలకు సమంత మద్దతు..

Black Foods: రంగును చూసి కాదు..పోషకాలను చూసి బ్లాక్ ఫుడ్స్‌ని తినండి.. ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో..

Crime News: స్నేహితులంతా కలిసి విందు చేసుకున్నారు.. అంతలోనే విషాదం.. స్పాట్‌లో యువకుడి దుర్మరణం!