Video: రియల్ హీరోలు మన మధ్యనే ఉన్నారు..! వీళ్లకి చేతులెత్తి మొక్కొచ్చు

చెన్నైలో కుండపోత వర్షంలో ప్రసవించిన ఓ వీధి కుక్క, దాని నవజాత కుక్కపిల్లలను ఓ దంపతులు రక్షించిన ఘటన సోషల్ మీడియాలో హృదయాలను కదిలిస్తోంది. నిర్మాణంలో ఉన్న ఇంట్లో సురక్షిత ఆశ్రయం కల్పించి, ఆహారం, నీరు అందించిన వారి మానవత్వానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Video: రియల్ హీరోలు మన మధ్యనే ఉన్నారు..! వీళ్లకి చేతులెత్తి మొక్కొచ్చు
Chennai Viral Video

Updated on: Jul 20, 2026 | 6:42 PM

కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పనులే చాలా గొప్పగా అనిపిస్తాయి. ఎందుకంటే.. ఆ పనులు మనకు చిన్నగా అనిపించినా కొందరి జీవితాలను నిలబెడతాయి. జీవితం అంటే మనదే కాదు.. మన చుట్టూ ఉంటే జీవులది కూడా. ఈ మాట మన చెప్పుకుంటున్నాం.. కానీ, ఈ దంపతులు దాన్ని నిజం చేసి చూపించారు. కుండపోత వర్షంలో ప్రసవించిన ఓ వీధి కుక్క, దాని నవజాత కుక్కపిల్లలను దంపతులు రక్షించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెన్నైకి చెందిన రీతు అనే యువతి ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. మానవత్వానికి అద్దం పట్టే ఈ సంఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రీతు తెలిపిన వివరాల ప్రకారం.. కుండపోత వర్షం కురుస్తున్న సమయంలో ఓ వీధి కుక్క అసురక్షితమైన ప్రదేశంలో తన పిల్లలకు జన్మనిచ్చింది. వర్షం కారణంగా నవజాత కుక్కపిల్లలు తడిసి ఇబ్బందులు పడుతుండగా, తల్లి కుక్క వాటిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ దృశ్యాన్ని గమనించిన రీతు తల్లిదండ్రులు వెంటనే స్పందించి ఆ కుక్క కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు.

వీడియో చూడండి

వైరల్ వీడియోలో రీతు తల్లి గొడుగు పట్టుకుని ఒక ప్లాస్టిక్ టబ్‌లో నవజాత కుక్కపిల్లలను జాగ్రత్తగా మోసుకెళ్తుండగా, తల్లి కుక్క ఆమె వెంట నమ్మకంగా నడుస్తూ కనిపిస్తుంది. ఆ తర్వాత వారిని నిర్మాణంలో ఉన్న తమ ఇంటికి తీసుకెళ్లిన రీతు తల్లిదండ్రులు పై అంతస్తులోని ఒక మూలను పూర్తిగా శుభ్రం చేసి, కుక్కతో పాటు దాని పిల్లలకు వెచ్చగా ఉండేలా చిన్న పడకను ఏర్పాటు చేశారు. అనంతరం వాటిని పొడిగా తుడిచి, తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించి సురక్షితంగా ఉంచారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుండగా, వేలాది మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. “మానవత్వం ఇంకా ఉందని ఈ వీడియో నిరూపించింది”, “మాటలతో కాదు, చేతలతో ప్రేమను చూపించారు”, “ఆ మూగజీవాలకు మీరు చేసిన సహాయం అమూల్యం” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జంతువుల పట్ల కనికరం చూపిన రీతు తల్లిదండ్రుల చర్య పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోందని, ఇలాంటి చిన్న చిన్న సహాయాలే సమాజంలో మానవత్వాన్ని నిలబెడతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us