Viral Video: వార్నీ.. ఐరన్‌ మ్యాన్‌లా ఉన్నాడే.. పై నుంచి కారు వెళ్లినా.. లేచి నిల్చున్న యువకుడు

సాధారణంగా బైక్ తగిలితేనే మనం విలవిల్లాడి పోతాం.. కానీ ఇక్కడో యువకుడు మాత్రం.. తనపై నుంచి బెంజ్‌ కారు వెళ్లినా.. వెంటనే పైకి లేచి ఆ కారుపై డాడి చేసేందుకు ప్రయత్నించాడు. చండీగఢ్‌లోని జరిగిన ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సదురు వ్యక్తిని కారుతో ఢీకొట్టిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు పోలీసులు.

Viral Video: వార్నీ.. ఐరన్‌ మ్యాన్‌లా ఉన్నాడే.. పై నుంచి కారు వెళ్లినా.. లేచి నిల్చున్న యువకుడు
Chandigarh Hit And Run

Updated on: Jul 12, 2026 | 9:54 PM

చండీగఢ్‌లోని సెక్టార్ 26లో మెర్సిడెస్ కారు బీభత్సం సృష్టించింది. మట్టి రోడ్డులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు కారును అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. సదరు కారు డ్రైవర్ తన కారును మళ్లీ రివర్స్‌లో ఆ జనాలపైకి తీసుకెళ్లాడు.. ఈ క్రమంలో అక్కడే నిల్చున్న ఓ యువకుడిపై ఏకంగా కారును ఎక్కించాడు. అనంతరం వేగంగా అక్కడి నుంచి కారుతో పారిపోయాడు. అయితే తనపై నుంచి కారు వెళ్లినప్పటికీ.. సదురు యువకుడు వెంటనే పైని లేచి కారుపై దాడి చేయడాని ప్రయత్నించాడు. ఇక స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుల కోసం గాలింపు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెక్టార్ 26 లోని బాబుధామ్ కాలనీకి చెందిన అమన్‌జాత్, సెక్టార్ 44 కి చెందిన అలన్స్ ప్రీత్ శనివారం సాయంత్రం సెక్టార్ 26 లోని ఒక డిస్కో క్లబ్‌కు వెళ్లారు. వారు క్లబ్ నుండి బయటకు వస్తుండగా, వేగంగా వచ్చిన ఓ మెర్సిడెస్ కారు వారిని ఢీకొట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. సమాచారం అందుకున్న సెక్టార్ 26 పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం GMCH-32 ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారు నంబరును, డ్రైవర్‌ను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాల సహాయంతో నిందితుడిని త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us