Viral Video: పాము వెంటబడి ఆటాడుకున్న పిల్లి.. ఫైటింగ్ సీన్ మాములుగా లేదు.. చూస్తే ఆశ్చర్యపోతారంతే!

|

Aug 16, 2021 | 12:04 PM

జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కోతి, పిల్లి, కుక్క వంటి జంతువులు చేసే..

Viral Video: పాము వెంటబడి ఆటాడుకున్న పిల్లి.. ఫైటింగ్ సీన్ మాములుగా లేదు.. చూస్తే ఆశ్చర్యపోతారంతే!
Cat With Snake
Follow us on

జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కోతి, పిల్లి, కుక్క వంటి జంతువులు చేసే అల్లరి చేష్టలు చూసేందుకు ఎంతో క్యూట్‌గా ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను భలేగా ఆకట్టుకుంటాయి. అయితే ఇక్కడ ఓ పాముతో పిల్లి యుద్దానికి దిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

పాము, ముంగిస పోట్లాటలు అందరూ చూసి ఉంటారు. కానీ పాముతో తలపడిన పిల్లిని ఎప్పుడైనా చూశారా.! ఇదిగో…ఇక్కడ జనావాసాల మధ్యకి వచ్చిన ఓ పాముతో తలపడేందుకు సిద్ధమయ్యిందో పిల్లి. ముందు కాళ్లతో పాముకి దమ్కీ ఇచ్చింది. ఈ ఫైటింగ్ సీన్ కొందరు వీడియో తీశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వీక్షకులను తెగ ఆకట్టుకుంటోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో నాగుపాముపై పిల్లి ఫైటింగ్ చేసింది. సహజంగా పామును చూడగానే పిల్లి పరుగులు తీస్తుంది. కానీ ఇక్కడ మాత్రం పామును ఓ ఆట ఆడుకుంది పిల్లి. తప్పించుకోవడానికి పాము ప్రయత్నిస్తుంటే.. పిల్లి అడ్డుకుంది. నాగుపాము బుసలు కొట్టినా.. పిల్లి భయపడలేదు. కాళ్లతో పాముపై దాడి చేస్తూనే ఉంది. పాము వెంటపడి మరీ దాడి చేసింది. చివరకు పిల్లి దాడిలో పాముకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read:

జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

 ఈ ఫోటోలో పులి దాగుంది.. మీరు గుర్తించగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చు చూడండి.!

ఎనిమిదో స్థానంలో సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియాకు సూపర్ విక్టరీ.. గెలిపించిన బెస్ట్ ఆల్‌రౌండర్!