Viral Photo: ఈ ఫోటోలో పులి దాగుంది.. మీ కళ్లకు ఇదొక పరీక్ష.. ఎవ్వరూ సాల్వ్ చేయలేకపోయారు..

|

Sep 01, 2021 | 9:08 AM

Find The Object Puzzle: సోషల్ మీడియాలో ఫైండ్ ది అబ్జెక్ట్ పజిల్స్ కోకొల్లలు. ప్రతీ రోజూ ఏదొకటి వైరల్ అవుతుంటాయి. అందులో ఒకటి ఇప్పుడు చూద్దాం..

Viral Photo: ఈ ఫోటోలో పులి దాగుంది.. మీ కళ్లకు ఇదొక పరీక్ష.. ఎవ్వరూ సాల్వ్ చేయలేకపోయారు..
Tiger
Follow us on

సాధారణంగా దూరంలో ఉన్న వాటిని కూడా మీరు చూడగలిగినట్లయితే.. మీవి డేగలాంటి కళ్లని చెప్పొచ్చు. మీ కళ్లకు పరీక్ష పెట్టే ఓ ఫోటోను ఇప్పుడు చూపించబోతున్నాం. అందులో ఏముందో మీరు ఫస్ట్ ట్రయిల్‌లోనే కనిపెట్టాలి. సోషల్ మీడియాలో అబ్జెక్ట్ పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో నెటిజన్లు ఆసక్తిని చూపిస్తున్నారు. వీటిల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘ఈ ఫోటోలో చిరుత దాగుంది’, ‘ఇందులో సింహం నక్కి ఉంది’ కనిపెట్టండి అంటూ ఎన్నో ఫోటో పజిల్స్ ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

వైరల్ అవుతున్న ఫోటోలో, పొదలు మాత్రమే కనిపిస్తున్నాయి కదా. కానీ ఓ క్రూర జంతువు వాటి మధ్య దాగుంది. అది ఎవరికీ కనిపించట్లేదు. ఇది మీ కంటి చూపుకు పరీక్ష.. అందులో ఏ జంతువు దాగుందో కనిపెట్టండి. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ పులి దాగుంది. దట్టమైన పొదలు కారణంగా ఆ పులి ఎక్కడుందో ఎవ్వరికీ కనిపించట్లేదు. మీవి డేగ కళ్లయితే.. దాన్ని మీరు కనిపెట్టేస్తారు.

ఈ ఫోటోలను తౌసీఫ్ అహ్మద్ అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. నాలుగు ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజిలో పోస్ట్ చేసి.. ”వీటిల్లో ఏ ఫ్రేమ్‌లో మీరు పులిని చూడగలుగుతున్నారు” అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక నెటిజన్లు ఈ ఫోటోలను విపరీతంగా ఇష్టపడుతున్నారు. పజిల్‌ను సాల్వ్ చేస్తూ.. సమాధానాలను కామెంట్స్ రూపంలో పోస్ట్ చేస్తున్నారు.

ఇవి చదవండి: