Viral: కొన్ని గంటల్లో పెళ్లి.. ఎయిర్‌ పోర్ట్‌లో వధువు.. అసలు విషయం తెలిసి అంతా షాక్.. కట్‌చేస్తే

|

Jan 30, 2023 | 10:37 AM

వివాహా వేడుక అంటేనే సందడి.. చిన్నా, పెద్దా అంతా కలిసి సందడి చేస్తుంటారు. తరచూ వైరల్ అయ్యే పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి.

Viral: కొన్ని గంటల్లో పెళ్లి.. ఎయిర్‌ పోర్ట్‌లో వధువు.. అసలు విషయం తెలిసి అంతా షాక్.. కట్‌చేస్తే
Viral
Follow us on

వివాహా వేడుక అంటేనే సందడి.. చిన్నా, పెద్దా అంతా కలిసి సందడి చేస్తుంటారు. తరచూ వైరల్ అయ్యే పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. కొన్నిసార్లు వరుడు, మరికొన్నిసార్లు వధువు.. ఇంకా బంధవులు.. ఇలా అంతా వారి చేష్టల కారణంగా వెలుగులోకి వస్తుంటారు. ఇదంతా ఒకటైతే.. పెళ్లికి అంతా సిద్ధమైంది.. కానీ సమయానికి వధువు రాకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.. ఇది కొంచెం ఆశ్చర్యకంగా అనిపిస్తుంది కదా.. అచ్చం ఇలాంటి ఘటనే అమెరికాలో ఒకటి చోటుచేసుకుంది. పెళ్లి మండపాన్ని భారీగా అలంకరించారు. వివాహ వేడుకకు వరుడు, అతిథులందరూ చేరుకున్నారు.. కానీ వధువు మాత్రం అక్కడికి చేరుకోలేకపోయింది. ఫైట్ రద్దయిన కారణంగా వధువు తన పెళ్లికి రాలేకపోయింది. ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

డైలీ మెయిల్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఈఘటన బెలిజ్‌లో జరిగింది. డిసెంబర్ చివరన కేటీ డుమ్కో అనే మహిళ.. తన పెళ్లికి తానే చేరుకోలేకపోయిందని పేర్కొంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో వరుడి తరఫు వాళ్లంతా మండపానికి చేరుకున్నారు. వధువు తరపున బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో వధువు.. ఒక నగరం నుంచి మరో నగరానికి చేరుకోవాల్సి ఉంది. కానీ ఇంతలో, వధువు వచ్చే విమానం అకస్మాత్తుగా రద్దు చేశారు.

అయితే, మూహుర్తం సమయం దగ్గరపడటం.. వధువు రాకపోవడంతో మ్యారేజ్ హాల్ లో కలకలం రేగింది. ఈ క్రమంలో వధువు విమానాశ్రయంలోనే ఉంది. పెళ్లికి హాజరైన అతిథులు, వరుడి తరపు వ్యక్తులు వధువుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే ఈ పెళ్లిలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరొక నివేదిక ప్రకారం.. వివాహ వేదిక కోసం వధూవరులు కలిసి ఒక రిసార్ట్‌ను బుక్ చేసుకున్నారు . కానీ పెళ్లి రోజు క్యాన్సిల్ కావడంతో రిఫండ్ మొత్తాన్ని ఇవ్వడానికి నిరాకరించనట్లు పేర్కొన్నారు. దీంతో ఆ దంపతులు రూ.58 లక్షల నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీనితో పాటు క్యాటరింగ్, ఫోటోగ్రఫీ, పూల అలంకరణలో చాలా నష్టం వాటిల్లినట్లు వివరించారు.

అయితే వధువు రావాల్సిన విమానం సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్ కంపెనీకి చెందినది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ గత వారం కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరింది. కాగా.. ఇటీవల మంచు తుఫాను కారణంగా అమెరికాలో వేలాది విమానాలను రద్దు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..