ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. బంధువులు, స్నేహితుల మధ్య ఎంతో సరదాగా, ఆనందగా పెళ్లి చేసుకుంటున్న జంటలు.. మండపంలోనే అల్లరి చేస్తూ.. డ్యాన్స్, ఆటపాటలతో సంతోషంగా గడుపుతున్న వీడియోస్ మనం చూస్తుంటాం. అలాగే ఇటీవల పెళ్లి్లో వధూవరుల గొడవలు సైతం షాకింగ్ అనిపిస్తాయి. కానీ కొత్త జంట అందంగా.. ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వీడియోను మీరు చూశారా ?.. ప్రస్తుతం ఓ కొత్త జంట అద్భుతంగా స్టెప్పులేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అందులో వధూవరులిద్దరు నువ్వా నేనా అంటూ పోటీ పడి డ్యాన్స చేశారు. పంజాబీ మ్యూజిక్కు పంజాబీ స్టెప్పులేశారు. ఈ సాంగ్ 2003లో విడుదలైన లీగలైజ్డ్ ఆల్బమ్లోనిది. వరుడు వేసిన స్టెప్పులను వధువు కూడా అంతే ఎనర్జీతో చేసి అదుర్స్ అనిపించుకుంది. అంతేకాదు.. ఆమె హైహీల్స్ ధరించి పంజాబీ స్టెప్పులేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వధూవరుల డ్యాన్స్ చూసి సూపర్ .. వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.