Food Pharmer: ఆరోగ్యం అని బ్రౌన్ బ్రెడ్ తింటున్నారా.. షాకింగ్ న్యూస్ మీకోసం..

| Edited By: Ram Naramaneni

Jul 24, 2023 | 10:31 AM

గత కొన్ని దశాబ్దాలుగా భారత దేశంలో బ్రెడ్ వినియోగం గణనీయంగా పెరిగిందని.. వీటిని తినడం వల్ల కలిగే సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయని హిమత్‌సింకా ట్విట్టర్‌లో తెలిపారు. “కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలో బ్రెడ్ వినియోగానికి.. ఇప్పుడు భారతీయులు బ్రెడ్ వినియోగానికి ఎంతో వ్యత్యాసం ఉంది. బ్రెడ్ ను ఇప్పుడు అల్పాహారం, శాండ్‌విచ్‌లు, పాన్‌కేక్‌లు, స్నాక్స్ కోసం అంటూ ఎక్కువగా  ఫుడ్ ఫార్మా ట్వీట్ చేసింది.

Food Pharmer: ఆరోగ్యం అని బ్రౌన్ బ్రెడ్ తింటున్నారా.. షాకింగ్ న్యూస్ మీకోసం..
Revant Himatsingka aka Food Pharma
Follow us on

బోర్న్‌విటా,  క్యాడ్‌బరీపై లీగల్ నోటీసుతో సంచలనం సృష్టించిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రేవంత్ హిమత్‌సింకా దృష్టి ఇప్పుడు బ్రెడ్ వినియోగంపై పడింది. ఇప్పుడు వైట్ బ్రెడ్‌తో పోలిస్తే బ్రౌన్,  మల్టీగ్రెయిన్ బ్రెడ్ నిజంగా ఆరోగ్యకరమైన ఎంపిక కాదా అనే విషయంపై దృష్టి పెట్టాలని హిమత్‌సింకా అన్నారు. భారతదేశంలో బ్రెడ్ ఒక పెద్ద జోక్!” చెప్పారు. “భారతదేశంలో రెండు రకాల రొట్టెలు ఉన్నాయి. ఒకటి వైట్ బ్రెడ్ ఇది అనారోగ్యమని చెబుతూ ఉంటారు. మరొక రకం.. మల్టీ గ్రెయిన్స్..  గోధుమ బ్రెడ్,  హోల్‌గ్రెయిన్ తో తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యకరమైనవి అని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మల్టీ గ్రెయిన్ బ్రెడ్ వినియోగంపై షాకింగ్ న్యూస్ చెప్పారు.

గత కొన్ని దశాబ్దాలుగా భారత దేశంలో బ్రెడ్ వినియోగం గణనీయంగా పెరిగిందని.. వీటిని తినడం వల్ల కలిగే సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయని హిమత్‌సింకా ట్విట్టర్‌లో తెలిపారు.

“కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలో బ్రెడ్ వినియోగానికి.. ఇప్పుడు భారతీయులు బ్రెడ్ వినియోగానికి ఎంతో వ్యత్యాసం ఉంది. బ్రెడ్ ను ఇప్పుడు అల్పాహారం, శాండ్‌విచ్‌లు, పాన్‌కేక్‌లు, స్నాక్స్ కోసం అంటూ ఎక్కువగా  ఫుడ్ ఫార్మా ట్వీట్ చేసింది. “మీరు రోజుకు 2 రొట్టె ముక్కలను తింటే.. ఇలా మీరు ఒక  సంవత్సరంలో 700 కంటే ఎక్కువ ముక్కలను తింటారు. కనుక తినే ఆహారం విషయంలో మీరు సరైనదాన్ని ఎంచుకున్నారా అనేది నిర్ధారించుకోండి! ”

ఇవి కూడా చదవండి

వైట్ బ్రెడ్‌ను మైదా లేదా శుద్ధి చేసిన పిండితో తయారు చేస్తారు. ఈ మైదా పిండిలో తక్కువ పోషకాలు ఉంటాయని చెప్పారు. “మైదాపిండి..  గోధుమలను పాలిష్ చేయడం ద్వారా తయారుచేస్తారు. కనుక ఫైబర్ ను మైదా కోల్పోతుంది.”

అయితే “భారతదేశంలో బ్రౌన్ బ్రెడ్ కూడా ఆరోగ్యకరమైనది కాదు,” అని హిమత్సింకా తన వీడియోలో చెప్పాడు. గోధుమ పిండితో తయారు చేయడంతో బ్రౌన్  బ్రెడ్ తయారు చేస్తారు. “కారామెల్ రంగు 150A కారణంగా అవి గోధుమ రంగులో ఉంటాయి. ఈ కారామెల్ పంచదార పాకం రంగు కోకాకోలా, బోర్న్‌విటా రంగులను పోలి ఉంటుంది.

మూడవ రకం విషయానికొస్తే మల్టీగ్రెయిన్ బ్రెడ్ కేవలం గోధుమ పిండితో మాత్రమే కాదు ఇంకా రకరకాల ధ్యాన్యాలతో తయారు చేస్తారని ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పారు. “FSSAI ప్రకారం మల్టీగ్రెయిన్ బ్రెడ్ తయారీలో ఉపయోగించే పదార్థాలు బరువు క్రమ పద్దతిలో ఉంటాయి. బ్రెడ్ తయారీలో ముఖ్యంగా మైదాని వినియోగిస్తారు. తర్వాత తక్కువ మొత్తంలో గోధుమలను వినియోగిస్తారు.హోల్ వీట్ బ్రెడ్‌లో కేవలం 20 శాతం హోల్ వీట్ మాత్రమే ఉందని పేర్కొన్నాడు.

“బ్రెడ్ తయారీలో కేవలం కొంతమొత్తంలో మాత్రమే గోధుమలను వినియోగిస్తారు. అయినప్పటికీ తయారు దారు తమని తాము సంపూర్ణ గోధుమ రొట్టె అని పిలుస్తారని” రేవంత్ హిమత్సింకా అన్నారు.

“మల్టీగ్రెయిన్ బ్రెడ్ అంటే అది ఆరోగ్యకరమైనదని కాదు. ఈ బ్రెడ్ లో ఒకటి కంటే ఎక్కువ ధాన్యాలను వినియోగించి తయారు చేశారని అర్థం. భారతదేశంలోని చాలా మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా ప్రధానంగా మైదాతో తయారవుతాయి”అని రేవంత్ హిమత్‌సింకా తన అభిప్రాయాన్ని పేర్కొన్నాడు.

అంతేకాదు ప్రజలకు బ్రెడ్ కు బదులుగా గోధుమ పిండితో తయారు చేసే రోటీలను ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. అయితే ప్రాసెస్ చేసిన రొట్టెలను తినాలనుకుంటే ప్యాకేజీని ఎప్పుడు తయారు చేశారనే విషయంపై దృష్టిని పెట్టుకోవాలని చెప్పారు. అంతేకాదు రొట్టెల తయారీలో వినియోగించే పదార్థాలను తనిఖీ చేయాలని స్థానిక బేకర్లలో ఉన్న రొట్టెల తయారీలో వినియోగించే మైదా, నూనె, ప్రిజర్వేటివ్‌లను వంటి వాటిని నివారించాలని ఫుడ్ ఫార్మర్ తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..