బీహార్‌లోని నలందలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. అందమైన ప్రేమ యువకుడికి ఖరీదైనదిగా మారింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పసుపు చొక్కా ధరించిన యువకుడు వరమాల సందర్భంగా వేదికపైకి చేరుకుని చేసిన పనితో అక్కడ ఉన్న వారంతా షాక్ అయ్యారు. హర్నౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముబారక్పుర్గ్రామానికి చెందిన ముఖేశ్ అనే యువకుడు, ఓ యువతి ఏడాది కాలంగా లవ్ చేసుకుంటున్నారు. అయితే, ఈ విషయం నచ్చని యువతి కుటుంబ సభ్యులు, ఆమెకు వేరే యువకుడితో వివాహం జరిపించేందుకు ప్లాన్ చేశారు. పెళ్లి జరగుతుండగా ముఖేశ్ అక్కడికి చేరుకున్నాడు. పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తె వరమాలలు మార్చుకుంటుండగా వేదికపై చేరుకుని, వధువు మెడలో వరమాల వేసి, బొట్టు కూడా పెట్టేశాడు. ఈ తతంగం అంతా చూసిన వధువు తరపు బంధువులు.. సదరు యువకుడిని పట్టుకుని కొట్టేశారు. దీంతో ప్రియుడి కుటుంబ సభ్యులు పరిస్థితి విషమించడంతో వెంటనే సదర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ ప్రథమ చికిత్స తర్వాత ఉన్నత కేంద్రానికి రెఫర్ చేశారు.
प्रेमिका ने प्रेमी से कहा कि मेरी शादी के बीच में आकर सिंदूर लगा देना. प्रेमी ने बिलकुल वैसा ही किया. लेकिन प्रेमिका ने ये नहीं बताया कि उसके बाद क्या करना है?
ఇవి కూడా చదవండిसिंदूरकांड के बाद लड़की के घरवालों ने प्रेमी की पिटाई कर दी. लड़का अस्पताल में है, दोनों तरफ से थाने में शिकायत दी गई. pic.twitter.com/04wMZuRJ6O
— Utkarsh Singh (@UtkarshSingh_) July 7, 2022
ఈ క్రమంలో ప్రియుడు ముఖేష్ మాట్లాడుతూ, మేమిద్దరం ఇష్టపడ్డాం. ఏడాదిగా ప్రేమించుకుంటున్నాం. మా ప్రేమ విషయం అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో ఆమెకు పెళ్లి చేసేందుకు నిశ్చయించారు. దీంతో నా ప్రియురాలు నాతో మాట్లాడింది. మావాళ్లు రేపు పెళ్లి చేస్తున్నారు.. వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలని ఫోన్‌లో కోరింది.” అని చెప్పుకొచ్చాడు.
ప్రియుడు చేసిన తతంగాన్ని చూసిన వరుడు.. వధువును పెళ్లి చేసుకోకుండానే వేదికపై నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. దీనిపై విచారణ చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.