Viral Video: లైకులు వస్తాయనుకున్నాడు.. షర్ట్ పైకి ఎగరేశాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!

ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఫన్‌ ఎలివేట్ చేయడంతో పాటు..

Viral Video: లైకులు వస్తాయనుకున్నాడు.. షర్ట్ పైకి ఎగరేశాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!
Funny Video

Updated on: Mar 02, 2022 | 1:16 PM

ఈ మధ్యకాలంలో యువత సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఫన్‌ ఎలివేట్ చేయడంతో పాటు వీడియోలు విభిన్నంగా ఉండాలని సరికొత్తగా ట్రై చేస్తున్నారు ఈకాలపు యువత. కొన్నిసార్లు అవి మంచిగా వచ్చి లైకులు తెచ్చిపెడుతుంటే.. మరికొన్నిసార్లు ఆ ప్రయత్నాలు బెడిసికొట్టి నెట్టింట పొట్టచెక్కలయ్యేలా నవ్వులు పూయిస్తున్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటో చూసేద్దాం పదండి…

వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువకుడు రోడ్డు ప్రక్కనే బైక్ ఆపి.. ఓ హిందీ పాటకు కాలు కదుపుతున్నట్లు మీరు చూడవచ్చు. అలా అతడు పాట లిరిక్స్‌కు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తుండగా.. మధ్యలో తన చొక్కాను విప్పి గాల్లో ఎగరేస్తాడు. ఇంతవరకూ బాగానే ఉంది.. అయితే కథలో ట్విస్ట్ ఏంటంటే.. అలా పైకి ఎగరేసిన చొక్కాను అటుగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తులు క్యాచ్ పడతారు. ఇక దాని కోసం పాపం.! ఈ యువకుడు వారి వెంట పడతాడు. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసి అందరూ కూడా తెగ నవ్వుకుంటున్నారు.

కాగా, ఈ వీడియోను ‘Ghantaa’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. కొన్ని గంటల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకు సుమారు 60 వేల లైకులు వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us