Viral Video: ఎద్దు ముందు ఏశాలేశాడు.. యమధర్మరాజుకు హాయ్ చెప్పొచ్చాడు.. షాకింగ్ వీడియో..

|

Aug 16, 2022 | 12:35 PM

తాజాగా ఓ వ్యక్తి ప్రశాంతంగా ఉన్న ఎద్దు ముందు వెకిలి చేష్టలు చేశాడు. దీంతో చావు రుచి చూపించింది. జీవితాంతం గుర్తిండిపోయే పాఠం నెర్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Viral Video: ఎద్దు ముందు ఏశాలేశాడు.. యమధర్మరాజుకు హాయ్ చెప్పొచ్చాడు.. షాకింగ్ వీడియో..
Viral
Follow us on

ఈ ప్రపంచంలో ఉన్న జంతువులన్ని ప్రమాదకరమైనవి కావు. కొన్ని కోపంగా ఉంటాయి.. మరికొన్ని ప్రశాంత స్వభావం కలిగి ఉంటాయి. అయితే ఎప్పుడు ప్రశాంతంగా ప్రజల మధ్య ఉండే జంతువులు కొన్నిసార్లు అనుహ్యంగా మనుషుల పై దాడి చేస్తాయి. ముఖ్యంగా వాటి ముంచి అతి తెలివి ప్రదర్శించడం.. వాటిని రెచ్చగొట్టడం చేస్తే మనపై తీవ్రంగా దాడి చేస్తాయి. మనుషులపై జంతువుల దాడికి సంబంధించిన వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. అందులో ఫన్నీగా ఉండేవి కొన్ని. షాకింగ్.. వణుకు పుట్టించేవి మరికొన్ని. తాజాగా ఓ వ్యక్తి ప్రశాంతంగా ఉన్న ఎద్దు ముందు వెకిలి చేష్టలు చేశాడు. దీంతో చావు రుచి చూపించింది. జీవితాంతం గుర్తిండిపోయే పాఠం నెర్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఉత్సవంలో భాగంగా ఖాళీ ప్రదేశంలో ఎద్దు కొమ్ములకు నిప్పు పెట్టి వదిలేశారు. చుట్టు భారీ సంఖ్యలో ప్రజలు ఉండి అరుస్తున్నప్పటికీ ఆ ఎద్దు ప్రశాంతంగా ఉంది. అయితే దాని ముందు నిల్చున్న వ్యక్తి మాత్రం.. తన మాటలు.. చేష్టలతో ఆ ఎద్దును రెచ్చగొట్టాడు. దీంతో కోపంతో ఉగిపోయిన ఎద్దు అతని వెంట పరిగెత్తడంతో అతడు ముందు ఉన్న స్టెప్స్ పైకి పారిపోయాడు. అయినా వదలని ఎద్దు..అతడిని తన కొమ్ములతో ఎత్తి పడేసింది. దీంతో అతడు మెట్లపై పడి ఆ తర్వాత నెలపై స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వీడియోను డార్విన్ అవార్డ్స్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.