Watch: మీరలా ప్రయత్నించకండి గురూ.. ఇరుక్కుపోతారు..! దిమ్మతిరిగిపోయే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

| Edited By: TV9 Telugu

Dec 18, 2023 | 3:43 PM

ఆనంద్‌ మహీంద్రా అత్యంత ప్రజాదరణ కలిగిన భారతీయ వ్యాపారవేత్తల్లో ముందువరుసలో ఉంటారు. సోషల్‌ మీడియా నిత్యం యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోలను షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తూ ఉంటారు. కేవలం ట్విట్టర్‌ ఎక్స్‌లో ఆయనకు ఏకంగా 10.09 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆయన క్రేజ్‌ను మనం తెలుసుకోవచ్చు.

Watch: మీరలా ప్రయత్నించకండి గురూ.. ఇరుక్కుపోతారు..! దిమ్మతిరిగిపోయే వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
Anand Mahindra Viral Video
Follow us on

మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యంగా సోషల్‌ మీడియా ఎక్కువగా వాడేవారికి ఆనంద మహీంద్రాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆనంద్‌ మహీంద్రా అత్యంత ప్రజాదరణ కలిగిన భారతీయ వ్యాపారవేత్తల్లో ముందువరుసలో ఉంటారు. సోషల్‌ మీడియా నిత్యం యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్రా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వీడియోలను షేర్‌ చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తూ ఉంటారు. కేవలం ట్విట్టర్‌ ఎక్స్‌లో ఆయనకు ఏకంగా 10.09 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆయన క్రేజ్‌ను మనం తెలుసుకోవచ్చు. ఆనంద్‌ మహీంద్రా ఇటీవల వెయిట్‌ వాట్‌..? డోంట్‌ ట్రై దిస్‌ ఎట్‌ హోమ్‌? అంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు ఆ వీడియోలో ఏముంది? వంటి విశేషాలను ఓ సారి చూద్దాం.

క్లిష్ట పరిస్థితుల్లో డ్రైవర్‌ చేసిన గమ్మతైన విన్యాసం ఈ వీడియోలో ఉంది. కొండప్రాంతంలోని ఇరుకైన రోడ్డుల్లో  ఎదురెదురుగా రావడంతో ఓ కారును ఓ డ్రైవర్‌ రిస్కీగా దాటించాడు. బ్లాక్‌ సెడాన్‌ కారు డ్రైవర్‌ అత్యంత చాకచక్యంతో కారు రెండు టైర్లను పకనున్న గోడపైకి ఎక్కించి దాటించాడు. ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఈ వీడియోకు 70 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. అలాగే 9 వేల లైక్స్‌ వచ్చాయి. చాలా మంది సోషల్‌ మీడియా వినియోగదారులు డ్రైవర్‌ నైపుణ్యాలను మెచ్చకుంటున్నారు. అయితే డ్రైవర్‌ నైపుణ్యం ఎంత బాగున్నా ఇలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ఆనంద్‌ మహీంద్రాను మనస్సును దోచుకోవడంతో ఆయన కూడా ఈ వీడియోను షేర్‌ చేశారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ కథనాల కోసం క్లిక్ చేయండి..