Viral Video: నడిరోడ్డుపై వరద నీటిలో హాయిగా పడుకుని.. గురుడు ఏమన్నా ఎంజాయ్‌ చేస్తు్న్నాడా..? వీడియో చూశారంటే నవ్వకుండ ఉండలేరు..

భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదల కారణంగా మహానగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ప్రవహిస్తున్న వరద ఉధృతిలో ఓ వ్యక్తి..

Viral Video: నడిరోడ్డుపై వరద నీటిలో హాయిగా పడుకుని.. గురుడు ఏమన్నా ఎంజాయ్‌ చేస్తు్న్నాడా..? వీడియో చూశారంటే నవ్వకుండ ఉండలేరు..
Bmc

Updated on: Jul 08, 2022 | 1:47 PM

Viral Video: రుతుపవనాల ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. అటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు, వరదల కారణంగా మహానగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ప్రవహిస్తున్న వరద ఉధృతిలో ఓ వ్యక్తి రోడ్డుపై హాయిగా పడుకుని ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అతను మలాడ్‌లో మాల్దీవులను అనుభవిస్తున్నాడని నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోని విక్రాంత్ జోషి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్‌ చేశారు. వీడికి ఫన్నీ క్యాప్షన్‌ కూడా జత చేశారు. “ఈ వ్యక్తిని BMCని మలాడ్‌లో మాల్దీవులుగా భావించినందుకు ధన్యవాదాలు ” అని శీర్షిక పెట్టారు. షాహిద్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ, “ఈ వ్యక్తి మలాడ్‌లో మాల్దీవులను అనుభవిస్తున్నాడు” అని వ్రాసాడు. హిందీ పాటలోని ఒక లైన్‌తో దానికి క్యాప్షన్ ఇచ్చాడు. ఇంతకు వీడియోలో ఏముందంటే…రద్దీ తక్కువగా ఉన్న రోడ్డుపై బస్సులు, కార్లు వంటి వాహనాలు వెళుతున్నాయి. రోడ్డంతా వరద నీరు నిండిపోయి ఉంది. కానీ, వరదలో రహదారిపై ఆ వ్యక్తి ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు. వచ్చే పోయే వాహనాలతో అతనిపై నీరు ఎగజల్లినట్టుగా పడుతోంది. అయినా అతడు హాయిగా కాలుమీద కాలు వేసుకుని పడుకుని ఉన్నాడు. వీడియో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోకు ఫేస్‌బుక్‌లో 10,000కు పైగా షేర్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, రానున్న రోజుల్లో ముంబైలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, భారత వాతావరణ శాఖ (IMD) ముంబై సమీప ప్రాంతాలకు శుక్రవారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రజలు బీచ్‌లను సందర్శించకుండా నిషేధించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us