Shocking Video: వీడి వయస్సు ఏడాది మాత్రమే.. ఆరు అడుగుల గేటు ఈజీగా ఎక్కేశాడు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Shocking Video: సాధారణంగా ఒకటిన్నర సంవత్సరాల పిల్లవాడు సరిగ్గా నిలబడటమే కష్టం. అలాంటిది వాడు ఏకంగా నడిచాడు. అంతేనా.. ఏకంగా ఆరు అడుగుల

Shocking Video: వీడి వయస్సు ఏడాది మాత్రమే.. ఆరు అడుగుల గేటు ఈజీగా ఎక్కేశాడు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
Child Viral

Updated on: Aug 16, 2021 | 6:35 AM

Shocking Video: సాధారణంగా ఒకటిన్నర సంవత్సరాల పిల్లవాడు సరిగ్గా నిలబడటమే కష్టం. అలాంటిది వాడు ఏకంగా నడిచాడు. అంతేనా.. ఏకంగా ఆరు అడుగుల పొడవైన గేట్‌ను అలవోకగా ఎక్కి దిగేశాడు. అదికూడా ఎవరి సపోర్ట్ లేకుండా.. పట్టు లేకుండానే ఎక్కి దిగడం విశేషం. అవునండీ.. ఇది నిజంగా నిజ్జం. ఆ బుడ్డోడు గేటు ఎక్కి దిగడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి మద్దతు లేకుండా ప్రశాంతంగా గేటు ఎక్కి.. ఏమాత్రం తడబడుకుండా దిగేశాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒకటిన్నర వయస్సు కలిగిన పిల్లవాడు.. డైపర్ ధరించి ఉన్నాడు. ఎలాంటి సపోర్ట్ లేకుడా ఇంట్లో ఉన్న ఆరు అడుగుల గేట్‌ను సునాయాసంగా ఎక్కేశాడు. అంతే సునాయాసంగా ఇవతలివైపు నుంచి అవతలి వైపునకు దిగాడు. అంతేకాదు.. ఆ పిల్లాడు తనకు ఎలాంటి హానీ జరగకుండా పూర్తి జాగ్రత్తవహించాడు. ఆ చిన్నోడు అలా గేట్ ఎక్కి దిగడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. కాగా, పిల్లాడు గేటు ఎక్కి దిగుతుండగా.. అక్కడే ఉన్నవారు వీడియో తీశారు.

ఆ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా విపరీతంగా ట్రోల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజంగా షాకింగ్‌గా ఉందని, నమ్మలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ఈ పిల్లాడు.. ఒక ప్రొఫెషనల్ మాదిరిగా గేటు ఎక్కి దిగుతున్నాడని నెటిజన్లు కామెంట్ మెన్షన్ చేశారు. మరెందుకు ఆలస్యం.. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Bhishma-Bhima: గంగా స్నానం.. గంగలో అస్థికలు కలపడానికి గల పరమార్ధాన్ని భీముడికి చెప్పిన భీష్ముడు

Viral Video: పిల్లలు కాదు చిచ్చర పిడుగులు.. ‘లోకల్ మేడ్ సూపర్ బైక్’పై ఎలా దూసుకెళ్తున్నారో చూడండి..

Silver Price Today: వెండి ధరలకు బ్రేకులు.. దేశీయంగా స్థిరంగా కొనసాగుతున్న సిల్వర్‌ ధరలు.!