Viral Video: సింగిల్‌గా ఉన్న ముసలిని చుట్టుముట్టిన సింహాల గుంపు.. కానీ ఇంతలో..
Viral Video: సింహాలు ఎలాంటి జంతువులనైనా వేటాడతాయి. కానీ సినిమాలు కూడా వేటాడలేని జంతువులు కొన్ని ఉంటాయి. అడవికి రాజైన సింహం వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Viral Video: సింహాలు ఎలాంటి జంతువులనైనా వేటాడతాయి. కానీ సింహాలు కూడా వేటాడలేని జంతువులు కొన్ని ఉంటాయి. అడవికి రాజైన సింహం వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింహాల్లో మగ సింహాలు వేటకు దూరంగా ఉంటాయి. ఎక్కువగా ఆడ సింహాలు మాత్రమే వేటాడుతూ ఉంటాయి. అయితే తాజాగా సింహాలకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ ఆడ సింహల గుంపుకు వేటాడే సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఇప్పుడు ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకు వేటాడటానికి వెళ్లిన సింహాలకు తగిలిన షాక్ ఏంటంటే. సింహాల గుంపు ఏకంగా ఓ ముసలిని వేటాడటానికి ప్రయతించాయి ఆ తర్వాతి ఏం జరిగిందంటే.
మొసళ్లు నీళ్ళల్లో ఉంటే చాలా బలంగా ఉంటాయి. ఎంతటి జంతువునైనా నీళ్లలో ఉంటే మొసళ్ళు చంపి తినగలవు. అలాంటి ముసలిని ఓ సింహల గుంపు వేటాడేందుకు ప్రయత్నించింది. నీటి ఒడ్డున ఉన్న ముసలి పై ఒక్కసారిగా దాడి చేశాయి. అయితే ఆ ముసలి సింహాలను చూసి భయపడలేదు. సింహాలను ప్రతిఘటించింది ఆ ముసలి. సింహల పై తిరిగి దాడి చేసింది. దాంతో ఆ సింహాలు వెనక్కు తగ్గాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను లయన్స్ డైలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది. కేవలం 35 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియా యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకి ఇప్పటి వరకు 126k వ్యూస్ వచ్చాయి. చాలా మంది లైక్ కూడా చేశారు. ఈ షాకింగ్ వీడియో పై మీరూ ఓలుక్కెయండి..
View this post on Instagram