Viral Video: వామ్మో రష్యాలో అంత రేటా.. అరటిపండ్లు, వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కే..

రష్యాలో అడుగుపెడితే జేబు ఖాళీ అవ్వాల్సిందేనా? అక్కడ కేవలం నాలుగు అరటిపండ్లు, ఒక చిన్న పెరుగు ప్యాకెట్ ధర వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. భారత్‌తో పోలిస్తే రష్యాలో సామాన్య వస్తువుల ధరలు ఎంత ఘోరంగా ఉన్నాయో చూపిస్తూ ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: వామ్మో రష్యాలో అంత రేటా.. అరటిపండ్లు, వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కే..
Russia Grocery Prices Vs India

Updated on: Jul 18, 2026 | 3:31 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని నవ్విస్తే, మరికొన్ని వినోదాన్ని పంచుతాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రం సరికొత్త, ఆసక్తికరమైన విషయాలను మనకు పరిచయం చేస్తాయి. తాజాగా రష్యా దేశానికి సంబంధించిన అలాంటి ఒక వీడియోనే నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్ రష్యాలోని ఒక లోకల్ స్టోర్‌కు వెళ్లి, అక్కడ లభించే నిత్యావసర వస్తువుల ధరలను చూపిస్తూ భారతదేశ ధరలతో పోల్చాడు. ఇది చూసిన నెటిజన్లు.. రష్యాలో సామాన్య వస్తువుల ధరలు భారత్ కంటే ఇంత ఎక్కువగా ఉన్నాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వాటర్ బాటిల్ కోసం తిప్పలు

ఇన్‌స్టాగ్రామ్‌లో @soni_traveling అనే అకౌంట్ నుండి ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. వీడియో ప్రారంభంలో సదరు భారతీయ వ్లాగర్ రష్యాలోని ఒక చిన్న దుకాణానికి వెళ్తాడు. అక్కడ కౌంటర్ వద్ద ఉన్న రష్యన్ మహిళను వాటర్ బాటిల్ అడుగుతాడు. అయితే భాషా సమస్య కారణంగా ఆమె మొదట అతనికి ఫ్లేవర్డ్ లెమన్ వాటర్ ఇచ్చింది. వ్లాగర్ సైగలు చేస్తూ తనకు నార్మల్ వాటర్ కావాలని వివరించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అతనితో ఉన్న ఒక స్థానిక రష్యన్ మహిళ సాయంతో సాధారణ నీళ్ల బాటిల్‌ను కొనుగోలు చేస్తాడు. ఆ బాటిల్ ధర 30 రూబుల్స్ అని షాప్ కీపర్ చెబుతుంది.

నాలుగు అరటిపండ్లు, చిన్న పెరుగు ప్యాకెట్ రూ. 300..

ఆ తర్వాత వారు అదే స్టోర్‌లో నాలుగు అరటిపండ్లు, ఒక చిన్న పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేస్తారు. వీటన్నింటికీ కలిపి బిల్లు వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. షాపింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన వ్లాగర్ రష్యాలోని ఖర్చుల వివరాలను ఇలా వివరించాడు.. రష్యాలో ఒక లీటర్ నార్మల్ వాటర్ బాటిల్ ధర 30 రూబుల్స్. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 40 రూపాయలు. అదే మన దేశంలో అయితే రూ.20కే లీటర్ బాటిల్ దొరుకుతుంది. కేవలం 4 అరటిపండ్లు, ఒక చిన్న పెరుగు ప్యాకెట్ కలిపి దాదాపు 200 రూబుల్స్ అయ్యింది. అంటే మన రూపాయల్లో దాదాపు 300 రూపాయలు అన్నమాట. మన దేశంలో రూ.300 ఖర్చు చేస్తే కొన్ని డజన్ల అరటిపండ్లు వస్తాయని వ్లాగర్ గుర్తు చేశాడు.

భారతీయులు రష్యా వెళ్తే షాక్ అవ్వాల్సిందే..

రష్యాలో పండ్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాల ధరలు భారత్‌తో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయని వ్లాగర్ తెలిపాడు. మొదటిసారి రష్యా వెళ్లే ఏ భారతీయుడైనా అక్కడి ధరలు చూసి కచ్చితంగా షాక్‌కు గురవుతారని అన్నాడు. ప్రస్తుతం రష్యాలోని నిత్యావసరాల ధరలకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us