Viral Video: బాప్ రే.. ఇంత పెద్ద లాలీపాప్‌ని ఎప్పుడైనా చూశారా?.. అసలెలా తయారు చేశారంటే..!

|

Jul 15, 2021 | 9:55 PM

Viral Video: లాలీపాప్‌ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. చిన్నారులు మొదలు.. పెద్దల వరకు చాలా మంది ఈ లాలీపాప్‌కు ఫ్యాన్స్..

Viral Video: బాప్ రే.. ఇంత పెద్ద లాలీపాప్‌ని ఎప్పుడైనా చూశారా?.. అసలెలా తయారు చేశారంటే..!
Big Lollipop
Follow us on

Viral Video: లాలీపాప్‌ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. చిన్నారులు మొదలు.. పెద్దల వరకు చాలా మంది ఈ లాలీపాప్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. రకరకాల లాలీపాప్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని చూడగానే.. ఖచ్చితంగా ఉవ్విళ్లూరుతాయి. అయితే, సాధారణంగా లాలీపాప్ చిన్న సైజులో ఉండటం మనం చూసే ఉంటాం. తిని ఉంటాం కూడా. కానీ, 25 కేజీల లాలీపాప్‌ను ఎప్పుడైనా తిన్నారా? పోనీ ఎప్పుడైనా చూశారా?. అవునండి బాబూ.. 25 కేజీల లాలీపాప్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసేస్తోంది. ఒకవేళ మీరు గనుక ఇంత పెద్ద లాలీపాప్‌ను చూడనట్లయితే.. ఇప్పుడు చూసేయండి. ఓ చెఫ్.. ఈ భారీ లాలీపాప్‌ని తయారు చేసి చూపించాడు. దాని తయారీ విధానం మొత్తాన్ని వీడియో చిత్రీకరించి.. యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ట్రెడింగ్‌లో ఉంది.

ఫిరోజ్ అనే వ్యక్తి ‘విలేజ్ ఫుడ్ ఛానెల్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ రన్ చేస్తున్నాడు. ఈ చానెల్‌లో గ్రామీణ వంటకాలు సహా రకరకాల వంటకాలు తయారు చేసే విధానాలను వివరిస్తుంటాడు. ఈ క్రమంలోనే భారీ లాలీపాప్‌ని తయారు చేసిన వీడియోను ఫిరోజ్ తన ఛానెల్‌లో పోస్ట్ చేశాడు. తొలుత సరిపడినంత చెక్కెర పోసి దానిని పాకం చేశాడు. అనంతరం అవసరమైన పదార్థాలను కలిపి వాటిని ఒక కుండలో పోశాడు. లాలీపాప్ స్టిక్ పెట్టి కాసేపటి తరువాత ఆ కుండను మెల్లాగా పగులగొట్టి భారీ లాలీపాప్‌ను బయటకు తీశాడు. విభిన్న రంగులతో అందంగా, అతిపెద్దదైన లాలీపాప్ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ భారీ లాలీపాప్‌‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు ఈ వీడియోను పది లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. ఈ భారీ లాలీపాప్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కాగా, వీరు తయారు చేసిన లాలీపాప్.. ప్రపంచంలోనే అతిపెద్ద లాలీపాప్‌గా పేర్కొన్నారు. మరి ఈ భారీ లాలీపాప్ మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Viral Video: అగ్నిప్రమాదంలో చిక్కుకున్న తల్లి.. తన రెండేళ్ల చిన్నారిని కిటికీలోంచి విసిరేసింది.. షాకింగ్ వీడియో..

AP-TS Water Disputes: ఆంధ్రా-తెలంగాణ జలవివాదం.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన కామెంట్స్ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి..

Telangana Corona Updates: తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు.. అయినా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న అధికారులు..