తెలంగాణలో నేడు తెరుచుకోనున్న ప్రార్థనా మందిరాలు.. మార్గదర్శకాలివే..!

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో 70 రోజులకు పైనే మూసివేసిన ప్రార్థనా మందిరాలు ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు

తెలంగాణలో నేడు తెరుచుకోనున్న ప్రార్థనా మందిరాలు.. మార్గదర్శకాలివే..!
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2020 | 8:31 AM

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో 70 రోజులకు పైనే మూసివేసిన ప్రార్థనా మందిరాలు ఇవాళ్టి నుంచి తెరుచుకోనున్నాయి. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇవాళ్టి నుంచి అన్ని ఆలయాలు, మసీదులు, చర్చిల్లో భక్తులకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ క్రమంలో ప్రార్థనా మందిరాల ప్రాంగణాలను సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుద్ధి చేశారు. కాగా కరోనా నేపథ్యంలో ప్రార్థనా మందిరాలకు వెళ్లే భక్తులకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

ప్రార్థనా మందిరాలకు మార్గదర్శకాలివే.. 1.పాదరక్షకాలు పెట్టుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి. 2.గుడి పరిసరాల్లోకి ప్రవేశించే ముందు చేతులు, కాళ్లు సోప్‌తో శుభ్రం చేసుకోవాలి. 3.చేతులు, కాళ్లు శుభ్రం చేసుకునే ప్రదేశాల్లో శుభ్రత పాటించాలి. 4.భౌతిక దూరం పాటించాలి. సామూహికంగా కూర్చోవడంపై నిషేధం. 5.విగ్రహాలు, పవిత్ర గ్రంధాలు, మజర్లను తాకడం నిషేధం. 6.భక్తులు ఎవరి మ్యాట్‌లను వారే తెచ్చుకోవాలి. 7.ప్రసాదం, తీర్థం వంటివి ఇవ్వడం నిషేధం. 8.భౌతిక దూరాన్ని పాటిస్తూ అన్నదానం చేసుకోవచ్చు. 9.ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే దర్శనాలు. 10.మాస్కు లేకుంటే ప్రవేశం ఉండదు. 11.దర్శన సమయంలో క్యూ పాటిస్తూ మార్కింగ్ చేసిన సర్కిల్‌లో ఉండాలి. 12.తలనీయాలు తీయడం నిషేధం. 13.ప్రదక్షిణలు చేసుకునే అవకాశం ఉంది. 14.ఆరోగ్యం సరిగా లేని వారు, 10 సంవత్సరాల లోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వారు దర్శనానికి నిషేధం.

Read This Story Also: శివసేన విమర్శలకు చెక్‌ పెట్టిన సోనూసూద్..!

Latest Articles